Tollywood: టాలీవుడ్‌లో మళ్లీ పాత కష్టం… సీనియర్లకు, కుర్రాళ్లకూ అదే పరిస్థితి!

ఏంటీ… టాలీవుడ్‌లో హీరోయిన్లు లేరా? మరీ విడ్డూరంగా ఉందే? సోషల్‌ మీడియాలో చూస్తే వరుస పెట్టి పోస్టులతో హీరోయిన్లు కనిపిస్తుంటారు కదా. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా మన దగ్గర చాలామంది కథానాయికలు ఉన్నారు కదా అంటారా? అవును నిజమే… అంతమంది కథానాయికలు అయితే ఉన్నారు. కానీ మన దగ్గర కొత్త సినిమా తెరకెక్కుతోంది అంటే… హీరోయిన్ల కోసం పెద్ద కుస్తీనే జరుగుతోంది. కావాలంటే మీరే చూడండి సినిమా ఓకే అయ్యి.. హీరోయిన్‌ ఓకే కాని సినిమాలు ఎన్ని ఉన్నాయో.

* చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. నవంబరు నుండి ప్రారంభం కానున్న ఈ సినిమా హీరోయిన్‌ ఇంకా ఓకే అవ్వలేదు. యూవీ క్రియేషన్స్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో అనుష్క పేరు పరిశీలనలో ఉందని లేటెస్ట్‌ టాక్‌. అంతకుముందు మృణాల్‌ ఠాకూర్‌ పేరు వినిపించింది.

* నాగార్జున – విజయ్‌ బిన్నీ కాంబినేషన్‌లో ‘నా సామిరంగ’ అనే సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నాయికగా కాజల్‌ పేరు పరిశీలనలో ఉంది. అయితే ఇషికా రంగనాథ్‌, మానస వారణాసి పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

* రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో చాలా నెలల క్రితమే సినిమా అనౌన్స్‌ చేశారు. ఈ పాన్‌ ఇండియా సినిమాలో హీరోయిన్‌ కోసం కుర్ర నాయికలు, కొత్త నాయికల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా ఎవరూ ఓకే అవ్వలేదు.

* రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాయిక ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. శ్రీలీలను ఎంపిక చేయొచ్చు అనే పుకార్లు అయితే వస్తున్నాయి.

* గోపీచంద్‌ హీరోగా శ్రీను వైట్ల ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఓపెనింగ్‌ కూడా జరిగింది. అయితే ఇందులో నాయిక ఎంపిక సంగతి తేలడం లేదు. సీనియర్‌ నాయిక జెనీలియాతో చర్చలు జరుగుతున్నాయనే ఓ టాక్‌ బయటకు వచ్చింది.

* రామ్‌ – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చాలా రోజుల క్రితమే మొదలైంది. షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా పూర్తయినప్పటికీ ఇంకా హీరోయిన్‌ ఎవరు అనేది తేలడం లేదు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus