Mrunal Thakur: హాయ్ నాన్న మూవీలో మోడిష్ లుక్‌‌లో మృణాల్ ఠాకూర్!

సీతారామం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్‌. సీత పాత్ర‌లో స‌హ‌జ అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని మ‌న‌సుల్ని గెలుచుకుంది. ఒక్క విజ‌యంతో టాప్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని, నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘హాయ్ నాన్న’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ గ్లింప్స్ చివరిలో మృణాల్ ఠాకూర్..

హీరో నానిని ‘హాయ్ నాన్నా’ అని పిలవడం క్యురియాసిటీని పెంచింది. ఈ గ్లింప్స్ చూడడానికి అందంగా ఉండటంతో పాటు.. మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. అలాగే నాని, మృణాల్‌ల రిలేషన్ సినిమాలో ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. మంగళవారం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు (ఆగస్ట్ 01). ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

మృణాల్ ఇందులో ఆకర్షణీయమైన చిరునవ్వుతో కనిపించగా, నాని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించారు. చెవిపోగులు, ముక్కుపుడక ధరించి.. మోడిష్ లుక్‌‌లో మృణాల్ ఆకట్టుకుంటోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ఈ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌కి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus