Hi Nanna Collections: ‘హాయ్ నాన్న’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ అనే యువ దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. శృతి హాసన్ కూడా స్పెషల్ కేమియో చేసిన ఈ మూవీ డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి అని చెప్పొచ్చు. కానీ మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్లో మాత్రమే కలెక్షన్స్ నమోదయ్యాయి. కానీ రెండో రోజు నుండి ఈ సినిమా పుంజుకుంది అనే చెప్పాలి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 7.24 cr
సీడెడ్ 1.81 cr
ఉత్తరాంధ్ర 1.80 cr
ఈస్ట్ 0.81 cr
వెస్ట్ 0.52 cr
గుంటూరు 0.73 cr
కృష్ణా 0.78 cr
నెల్లూరు 0.38 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.70 cr
 ఓవర్సీస్ 6.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 23.32 cr (షేర్)

‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రానికి రూ.30.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.23.32 కోట్ల షేర్ ను రాబట్టింది. మొదటి సోమవారం కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో స్టడీగా కలెక్ట్ చేసి, రెండో వీకెండ్ కూడా క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus