Hidimba First Review: ‘హిడింబ’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌, రివర్స్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో జూలై 20న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

కాబట్టి ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ మూవీ (Hidimba ) ఇదే అనుకోవచ్చు. ఇక కొన్ని చోట్ల ఈ చిత్రం షోలు పడ్డాయి. దాని టాక్ ప్రకారం..సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి : ఆద్య(నందిత సీత) అభయ్(అశ్విన్ బాబు) ఇద్దరూ ప్రేమికులు. కొన్ని కారణాల వల్ల విడిపోతారు. కానీ వీళ్ళు పోలీసులు అయిన తర్వాత నగరంలో జరుగుతున్న సీరియల్ కిడ్నాప్ ల కేసు కోసం కలిసి ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఓ ముఠాని పట్టుకుంటారు. దీంతో కేసు సాల్వ్ అయిపోయింది అనుకుంటారు.

కానీ ఆ ముఠా కిడ్నాప్ చేసిన అమ్మాయిలకి మిస్ అయిన అమ్మాయిలకి సంబంధం లేదు అని తేలుతుంది. హంతకుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే కిడ్నాప్ చేస్తున్నట్టు ట్రైలర్లో చూపించారు. దీంతో ఆద్య ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. కానీ అది ఫెయిల్ అవుతుంది. డిపార్ట్మెంట్లోనే ఓ అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. అందువల్ల ఆద్య సస్పెండ్ అవుతుంది. అసలు ఈ కిడ్నాప్ లకు పాల్పడుతున్న నరరూప రాక్షసులు ఎవరు? అనేది తెరపై చూడాల్సిన కథ.

ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్ గా సాగింది. ఇంటర్వెల్ బ్లాక్ కి అందరూ భయపడటంతో పాటు వాంతులు తెచ్చుకునే ప్రమాదం కూడా ఉందని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు లేట్ అయ్యాయి అని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు ఎక్కువగా ఉన్నాయి. నెరేషన్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుణ్ణు అని కొందరు అంటున్నారు. మిగిలిన వారు బాగానే ఉంది అంటున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus