Hidimba OTT: ‘హిడింబ’ డిజిటల్ రిలీజ్ ఎందులో.. ఎప్పటి నుండీ?

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీస్ ను అందించిన అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. జూలై 20న ఈ చిత్రం విడుదల అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

అశ్విన్ సినిమాలు చాలా వరకు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా కూడా కమర్షియల్ గా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే ఆ వర్షాల కారణంగా థియేటర్ కి వెళ్లలేకపోతున్న ప్రేక్షకులు ,, ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం..

ఈ చిత్రం డిజిటల్ హక్కులు ‘ఆహా’ వారు దక్కించుకున్నట్టు సమాచారం. దాదాపు రూ.4 కోట్లు భారీ రేటు చెల్లించి ఆహా వారు ‘హిడింబ’ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి 4 వారాలు పూర్తయ్యాక ఈ చిత్రాన్ని వారు డిజిటల్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆగస్టు 19 నాటికి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus