ఫ్లాప్ సినిమా వల్ల.. విశాల్‌కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ను ఎప్పడూ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంటుంది. నడిగర్ సంగం గొడవల్లో ఎప్పుడూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఓ ఫ్లాప్ సినిమా వల్ల విశాల్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే గతేడాది సుందర్.సి డైరెక్షన్లో ‘యాక్షన్’ అనే చిత్రం చేసాడు విశాల్. ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చినప్పటికీ .. నవంబర్ వంటి అన్-సీజన్లో విడుదల కావడం వల్ల కలెక్షన్లు రాలేదు. దీంతో ఆ చిత్రానికి భారీ నష్టాలు వచ్చాయి. నిజానికి ఈ చిత్రాన్ని 20కోట్ల బడ్జెట్లో పూర్తిచెయ్యాలి అనుకున్నారట నిర్మాతలు. కానీ చివరికి రూ.44కోట్లయ్యింది. నాన్ థియేట్రికల్స్ రూపంలో రూ.20కోట్ల వరకూ వచ్చాయి.

థియేట్రికల్ రిలీజ్ ను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ.11.7 కోట్ల వరకూ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ‘యాక్షన్’ చిత్రీకరణ సమయంలోనే… ‘నష్టాలు వస్తే నేను భరిస్తాను’ అని నిర్మాతలకు విశాల్ మాటిచ్చాడట.అంతేకాదు అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసాడట. ఇక సినిమా ఫుల్ రన్ ముగిసాక విశాల్ ను బ్యాలన్స్ అమౌంట్ కోసం నిర్మాతలు సంప్రదించగా.. తన తరువాతి చిత్రాన్ని ‘యాక్షన్’ నిర్మాతలతో చేస్తానని హామీ ఇచ్చాడట.

కానీ ఇప్పుడు సైలెంట్ గా వేరే నిర్మాతలతో తన నెక్స్ట్ సినిమా చెయ్యడానికి విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..’యాక్షన్’ నిర్మాతలు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. కోర్టు వారు కూడా నిర్మాతలకు అనుకూలంగానే తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక బ్యాలన్స్ అమౌంట్ అయిన రూ.8.3 కోట్లను విశాల్ ‘యాక్షన్’ నిర్మాతలకు చెల్లించాల్సి ఉంది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus