ఓటీటీలో సక్సెస్ అవుతాయా..?

ఈ మధ్యకాలంలో ఓటీటీలో విడుదలవుతోన్న సినిమాలు డిజాస్టర్ లుగా మిగిలిపోతున్నాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో విడుదలైన సినిమాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. గత నెలలో విడుదలైన నాని ‘వి’ సినిమాపై మంచి అంచనాలు ఉండేవి. అలానే అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా హైప్ క్రియేట్ చేసింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. రీసెంట్ గా విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’గా పెద్దగా ఏం లేదంటూ తేల్చేశారు. ఇక తమిళంలో విడుదలైన ‘పెంగ్విన్’, ‘పొన్ మగళ్ వందాల్’ లాంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.

దీంతో ఓటీటీలో అన్ని ఫ్లాప్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయనే ఫీలింగ్ జనాల్లో కలుగుతోంది. ఇలాంటి సమయంలో రెండు సినిమాలు ఆసక్తిని పెంచుతున్నాయి. అందులో ఒకటి ‘కలర్ ఫోటో’ కాగా.. మరొకటి ‘ఆకాశమే నీ హద్దురా’. కమెడియన్ సుహాస్ హీరోగా ‘కలర్ ఫోటో’ సినిమాను రూపొందిస్తున్నారు. చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సాయి రాజేష్ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా అనే భావన కలిగించగలిగింది. ఈ సినిమా ఈ నెల 23న ‘ఆహా’ యాప్ లో రిలీజ్ కానుంది.

మరోపక్క సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా అక్టోబర్ 30న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌత్ లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఇదే బిగ్గెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు అంచనాలకు తగ్గట్లుగా సక్సెస్ అందుకుంటాయేమో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus