డైరెక్టర్ శేఖర్ కమ్ముల వెండితెరపై లవ్ స్టోరీతో మాయచేసేందుకు రెడీ అయిపోయాడు. ఈసినిమా ఏప్రిల్ 16వ తేదిన ప్రేక్షకుల ముందుకి సమ్మర్ కానుకగా తీస్కుని రాబోతున్నారు. దీనికి సంబంధించిన రిలీజ్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది మూవీటీమ్. మజిలీ, వెంకీమామ, సినిమాల తర్వాత నాగచైతన్య ఈసారి మరో హిట్ కొడతాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి మజిలీ సినిమాలో సమంత క్యారెక్టర్ హైప్ వల్ల సినిమా సూపర్ హిట్ అయ్యిందని,
అందుకే కలక్షన్స్ పరంగా సూపర్ సక్సెస్ అందుకుందని అన్నారు. అలాగే, వెంకీమామ కూడా మల్టీస్టారర్ సినిమా కాబట్టి అది కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యిందని చెప్పారు. అందుకే, ఇప్పుడు సోలోగా నాగచైతన్య తన మార్కెట్ రేంజ్ ని చూసేందుకు ఇది పర్ఫెక్ట్ సినిమా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక యువ సామ్రాట్ నాగచైతన్యతో హైబ్రీడ్ పిల్ల సాయిపల్లవి కూడా ఆడియన్స్ ని ఫిదా చేయబోతోంది. రీసంట్ గా రిలీజైనా టీజర్, సాంగ్స్ సినిమాపై యూత్ లో మంచి క్రేజ్ ని పెంచుతున్నాయి. చైతూ, సాయిపల్లవి జోడీకి ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్.
అన్ని డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా సమ్మర్ లో ఏప్రిల్ 16న థియేటర్స్ లో సందడి చేయనుంది. తాము కన్న కలల్ని నిజం చేసుకునేందుకు హీరో హీరోయిన్స్ ఏం చేశారు అనేది కథాంశంగా ఉండబోతోందని చెప్తున్నారు. అయితే, క్లైమాక్స్ ట్రాజెడీగా ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ టైమ్ లో ఫీల్ గుడ్ మూవీలాగా కనిపిస్తున్న లవ్ స్టోరీ నాగచైతన్యకి సక్సెస్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.