‘శ్రీమంతుడు’ టు ‘మగధీర’ .. యూట్యూబ్ లో జనాలు ఎక్కువగా చూసింది ఈ 10 సినిమాలే..!

  • October 19, 2022 / 12:43 PM IST

యూట్యూబ్ అనగానే మన తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మన తెలుగు సినిమాల ట్రైలర్లు, టీజర్లు, లిరికల్ సాంగ్స్, మేకింగ్ వీడియోస్ వంటివి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎంత ముఖ్యమో యూట్యూబ్ లో వ్యూస్, లైక్స్ వంటివి కూడా అంత ముఖ్యం. ఇక ఇంటర్వ్యూలు ఎలాగు కామన్.. అయితే ఈ మధ్యన కొత్తగా చెప్పుకోవాలి అంటే మీమ్స్ గురించి చెప్పుకోవాలి. ఇందులో చాలా వరకు ట్రోలింగ్ స్టఫ్ దొరుకుతుంది. గ్రామాల్లో ఉండే జనాలు కూడా ఖాళీ దొరికితే చాలు సెల్ ఫోన్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నారు.

ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి.. ఓటీటీ సబ్స్క్రిప్షన్లు లేని వాళ్ళు వీటికే ఓటేస్తుంటారు. ఓటీటీలు రానంత వరకు యూట్యూబ్ రాజ్యమేలేది. థియేట్రికల్ రన్ ముగిసాక చాలా సినిమాలు యూట్యూబ్ లో రిలీజ్ అయ్యేవి. ఇక్కడ ఏ సినిమాకి ఎన్ని వ్యూస్, లైక్స్ వచ్చాయి అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. అదే ఓటీటీల రిజల్ట్ ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. యూట్యూబ్ లో కొన్ని సినిమాలు రికార్డ్ వ్యూస్ నమోదు చేసాయి. జనాలు కొన్ని సినిమాలను ఎగబడి చూశారు. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) శ్రీమంతుడు : మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా యూట్యూబ్లో ఏకంగా 179 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది.

2) డిజె – దువ్వాడ జగన్నాథం :

అల్లు అర్జున్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి యూట్యూబ్లో ఏకంగా 128 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

3) నేను లోకల్ :

నాని- కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ మూవీకి త్రినాధ్ రావు నక్కిన దర్శకుడు. ఈ సినిమాకి యూట్యూబ్లో ఏకంగా 104 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

4) శతమానం భవతి :

శర్వానంద్ – అనుపమ జంటగా నటించిన ఈ మూవీని సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి యూట్యూబ్లో ఏకంగా 95 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

5) జనతా గ్యారేజ్ :

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి యూట్యూబ్లో 72 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

6) రారండోయ్ వేడుక చూద్దాం :

నాగ చైతన్య- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాకి యూట్యూబ్లో 70 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

7) నువ్వొస్తానంటే నేనొద్దంటానా :

సిద్దార్థ్ – త్రిష జంటగా నటించిన ఈ మూవీకి ప్రభుదేవా దర్శకుడు. ఈ సినిమాకి యూట్యూబ్లో 57 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

8) రేసు గుర్రం :

అల్లు అర్జున్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి యూట్యూబ్లో 41 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

9) మిర్చి :

ప్రభాస్ – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి యూట్యూబ్లో 36 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

10) మగధీర :

రాంచరణ్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి యూట్యూబ్లో 34 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus