NBK107: బాలయ్య మూవీలో ఆ యాక్టర్ రోల్ షాకయ్యేలా ఉంటుందా?

బాలయ్య107 మూవీ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జై బాలయ్య పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నెలరోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. అయితే ఈ మూవీలో ఒక పాత్రకు సంబంధించిన వివరాలు లీక్ కాకుండా చిత్రయూనిట్ జాగ్రత్త పడుతోందని తెలుస్తోంది.

ప్రముఖ నటుడు ఈ రోల్ లో కనిపిస్తారని సినిమాలో మొదట పాజిటివ్ గా కనిపించే ఈ పాత్ర తర్వాత నెగిటివ్ గా మారడంతో ప్రేక్షకులు సైతం షాక్ అవుతారని సమాచారం అందుతోంది. క్రాక్ సినిమాను మించిన హిట్ ఈ సినిమాతో సాధించేలా గోపీచంద్ మలినేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రేక్షకుల ఊహలకు అందని ట్విస్టులు ఉంటాయని వైరల్ అవుతున్న వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండటం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. శృతి హాసన్ సైతం ఈ సినిమాలో తన రోల్ వెరైటీగా ఉంటుందని వెల్లడించారు. గమ్మత్తుగా ఉండే పాత్రలో తాను కనిపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

అఖండతో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోగా ఈ సినిమాతో బాలయ్యకు అంతకు మించిన సక్సెస్ లభిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య వేగంగా సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయడంపై దృష్టి పెట్టారు. తర్వాత ప్రాజెక్ట్ లతో బాలయ్యకు ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus