వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రంలో ఆకట్టుకోనున్న అంశం ఏమిటంటే?

తొలి ప్రేమ.. ఈ పేరు వినగానే అందరికీ పవన్ కళ్యాణ్ సినిమా గుర్తుకు వస్తుంది. సిల్వర్ జూబ్లీ జరుపుకున్న  ఈ సినిమా టైటిల్ ని వరుణ్ తేజ్ తన సినిమాకి పెట్టుకోవడం.. కొంత లాభమే అయినా.. ఎక్కువగా నష్టమే అవుతుంది. ఎందుకంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఆ అంచనాలను అందుకోలేకపోతే సినిమా మోస్తరుగా ఉన్నప్పటికీ..  ఫ్లాప్ గానే చెబుతారు. అందుకే అంచనాలకు మించి ఉండేలా కష్టపడాల్సి ఉంటుంది. నూతన దర్శకుడు వెంకి అట్లూరి బాగా శ్రద్ధగా సినిమా తీసినట్టు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.  ముఖ్యంగా తమన్ సంగీతం అద్భుతమని సినీ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రేమ కథలకు సంగీతం ప్రాణాన్ని పోస్తుంది. ఆ విషయంలో తమన్ ఇప్పటికైతే మంచి మార్కులే కొట్టేశారు. ఇక రాశీ ఖన్నా ఇది వరకు చేసిన చిత్రాలకంటే భిన్నంగా కనిపించి ఆకర్షిస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన హైలెట్ సినిమాటోగ్రఫీ అని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం లండన్ లో చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు సినిమాకు గ్రాండ్ లుక్ ను తెచ్చిపెట్టబోతున్నాయని సమాచారం. ఈ సినిమా సినిమాటోగ్రఫర్ జార్జ్ లండన్ అందాలను అద్భుతంగా చూపించాడని టాక్. కథ, కథనం తో పాటు కెమెరా పనితనం కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. బివిఎస్ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus