డబ్బు లేక ఇబ్బంది పడుతున్నా : బన్నీ పై బోయపాటి ఫోకస్ : అనుష్క ఓటిటి ఎంట్రీ

ఈ కరోనా సమయంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలకు ఈ కష్టాలు తప్పవు కానీ సెలబ్రిటీ అయిన శృతిహాసన్ కూడా కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన దగ్గర డబ్బులు లేకపోయినా.. అమ్మా, నాన్నల సాయం మాత్రం కోరనని అంటోది శృతిహాసన్. లాక్ డౌన్ లో చాలా మంది స్మార్ట్ గా వ్యవహరించారని.. కానీ తను అలా చేయలేకపోయానని అన్నారు.సరిగ్గా లాక్ డౌన్ పడే సమయానికి కొద్దిరోజుల ముందు ఫ్లాట్ కొన్నానని.. దాని కారణంగా ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మాస్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఇమేజ్ బాగా దెబ్బతింది. ‘వినయ విధేయ రామ’ సినిమా డిజాస్టర్ కావడంతో బోయపాటితో సినిమా చేయడానికి హీరోలు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యని ఒప్పించి ‘అఖండ’ అనే సినిమా తీస్తున్నాడు బోయపాటి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమా భారీ విజయాలు అందుకోవడంతో ‘అఖండ’ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత బోయపాటి.. యంగ్ హీరో రామ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా మెటీరియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు బోయపాటి.. బన్నీ పై ఫోకస్ పెట్టాడట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందంటూ రెండు రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందని ఆరా తీయగా.. కొన్ని విషయాలు బయటపడ్డాయి. అనుష్కను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంప్రదించిన మాట నిజమేనని తెలుస్తోంది. ఓ పెద్ద దర్శకుడు లేడీ ఓరియెంటెడ్ కథ రాసుకున్నాడు. తన దగ్గర ఫీమేల్ సబ్జెక్ట్ ఉందని.. దాన్ని సినిమాగా తీయడానికి ప్రస్తుతం తనకున్న ఇమేజ్ అడ్డొస్తుందని ఆ దర్శకుడు గతంలో వెల్లడించాడు.ఇప్పుడు అదే కథతో అనుష్క ప్రధాన పాత్రలో ఓటీటీలో సినిమా తీయాలనేది ప్రతిపాదన.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus