Anushka Shetty: నెట్ ఫ్లిక్స్ క్రేజీ డీల్.. పక్కన పెట్టిన బ్యూటీ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందంటూ రెండు రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందని ఆరా తీయగా.. కొన్ని విషయాలు బయటపడ్డాయి. అనుష్కను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంప్రదించిన మాట నిజమేనని తెలుస్తోంది. ఓ పెద్ద దర్శకుడు లేడీ ఓరియెంటెడ్ కథ రాసుకున్నాడు. తన దగ్గర ఫీమేల్ సబ్జెక్ట్ ఉందని.. దాన్ని సినిమాగా తీయడానికి ప్రస్తుతం తనకున్న ఇమేజ్ అడ్డొస్తుందని ఆ దర్శకుడు గతంలో వెల్లడించాడు.

ఇప్పుడు అదే కథతో అనుష్క ప్రధాన పాత్రలో ఓటీటీలో సినిమా తీయాలనేది ప్రతిపాదన. అనుష్క ఒప్పుకుంటే ఇదొక ఓటీటీ ఒరిజినల్ సినిమాగా మారుతుంది. ఆమె ఎక్కువ కాల్షీట్స్ ఇవ్వగలిగితే మాత్రం ఈ కథను వెబ్ సిరీస్ గా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థకు బడ్జెట్ సమస్యలైతే ఉండవు. కానీ అనుష్క మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఆమె కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తామని నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసినప్పటికీ..

అనుష్క మాత్రం ప్రస్తుతానికి ఈ ప్రపోజల్ ను పక్కన పెట్టిందట. నిజానికి ఆమె యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయాల్సివుంది. అది మొదలుపెట్టకుండా మరో సినిమా లేదా వెబ్ సిరీస్ చేసే పరిస్థితి లేదు. అందుకే అనుష్క తనకొచ్చిన భారీ ఆఫర్ ను కూడా కొన్నాళ్లపాటు హోల్డ్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus