Shruti Haasan: ”ప్రతీ నెలా వాయిదాలు కట్టలేకపోతున్నా”

ఈ కరోనా సమయంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలకు ఈ కష్టాలు తప్పవు కానీ సెలబ్రిటీ అయిన శృతిహాసన్ కూడా కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన దగ్గర డబ్బులు లేకపోయినా.. అమ్మా, నాన్నల సాయం మాత్రం కోరనని అంటోది శృతిహాసన్. లాక్ డౌన్ లో చాలా మంది స్మార్ట్ గా వ్యవహరించారని.. కానీ తను అలా చేయలేకపోయానని అన్నారు.

సరిగ్గా లాక్ డౌన్ పడే సమయానికి కొద్దిరోజుల ముందు ఫ్లాట్ కొన్నానని.. దాని కారణంగా ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. సరైన టైమ్ కి సినిమాలు కూడా లేకపోవడంతో కష్ఠాలు రెట్టింపు అయ్యాయని.. ప్రతీ నెలా వాయిదాలు కట్టడానికి డబ్బులు కావాలి కదా అంటూ చెప్పుకొచ్చింది. అందుకే ఈ ఆర్ధిక కష్టాల నుండి బయటపడడానికి షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని చాలామంది లానే తాను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.

షూటింగ్స్ మొదలైతే సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తానని.. అప్పుడు చేతిలో డబ్బులు ఉంటాయని చెబుతోంది. తను స్వతంత్ర భావాలు గల మహిళనని.. తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలన్నీ సొంతంగా తీసుకున్నవే అని.. ఇల్లు కొనాలనేది కూడా సొంత నిర్ణయమని చెప్పుకొచ్చింది. కాబట్టి దాని వలన ఏర్పడిన ఆర్ధిక కష్టమని భరించాల్సిందే అని.. అమ్మా, నాన్నలను అడగకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus