భర్త చెంప పగలగొట్టింది : పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ : ఈసారి దుబాయ్ వరుడు

‘నువ్వు నేను’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ మంచి పేరు తెచ్చుకున్న నటి అనిత.. ఆ తరువాత ‘శ్రీరామ్’, ‘నేనున్నాను’ లాంటి చిత్రాలలో నటించింది. 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఈ జంటకు పండంటి మగబిడ్డ జన్మించింది. చాలా కాలంగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. పెళ్లి తరువాత కూడా బుల్లితెరపై సందడి చేస్తోంది.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సమయం కావడంతో ఇంటికే పరిమితమైంది అనిత. కాలక్షేపం కోసం పలు వీడియోలను చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ప్రాంక్ అని చెబుతూ ఏకంగా భర్త చెంప పగలగొట్టింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ హరిహర వీరమల్లు కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా అభిమానుల్లో అంచనాల డోస్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక మొదటిసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను టచ్ చేయడం హైలెట్ పాయింట్. దర్శకుడు క్రిష్ పక్కా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లాలని చూస్తున్నాడు.ఇక సినిమాకు సంబంధించిన టీజర్ విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎలాగైనా టీజర్ ను విడుదల చేయాలని ముందస్తు ప్లానింగ్ తో సిద్దంగా ఉన్నట్లు సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తెలుగు సినిమా పరిశ్రమలో పెళ్లి అనే మాట రాగానే గుర్తొచ్చే పేర్లు… హీరోల్లో ప్రభాస్‌, హీరోయిన్లలో అనుష్క. ఇద్దరి మధ్య వచ్చిన పెళ్లి కామెంట్స్‌ పక్కనపెడితే… వీళ్ల పెళ్లి ఎప్పుడు, ఎవరితో అనే మాట మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ప్రభాస్‌ అయితే ఈ ప్రశ్న అడిగే అవకాశమే లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు ఈ మాట అడుగుదామంటే ఎక్కడా కనిపించకుండా తిరుగుతోంది అనుష్క. దీంతో ఆమె పెళ్లి గురించి పుకారుజనులు ఎప్పుడూ ఏదో పుకారు తెస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి అనుష్క పెళ్లి వార్తల్లో నిలిచింది.
(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న సమంత బాలీవుడ్ ఇండస్ట్రీపై మాత్రం దృష్టి పెట్టలేదనే సంగతి తెలిసిందే. తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ రెండు ఇండస్ట్రీలకే సమంత పరిమితమయ్యారు. అయితే ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ ద్వారా సమంత బాలీవుడ్ ఎంట్రీ జరుగుతోంది. ఫ్యామిలీ మేన్ 2 హిట్ అయితే మాత్రం సమంతకు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే పలువురు హీరోయిన్లు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి సత్తా చాటారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

చాలా ఏళ్లుగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్న వైవీఎస్‌ చౌదరి… ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న వైవీఎస్‌ చౌదరి.. తన కొత్త సినిమా గురించి చెబుతూనే.. కరోనా పరిస్థితులు, సినిమా పరిశ్రమపై కరోనా ప్రభావం, ప్రజల స్థితిగతుల గురించి ప్రస్తావించారు. అయితే ఈ క్రమంలో ఆయన పొలిటికల్‌ కామెంట్స్‌ కొన్ని చేశారు. ఇప్పుడవి చర్చకు దారితీశాయి. వైవీఎస్‌ చౌదరి సినిమాలు చాలాపవర్‌ఫుల్‌గా ఉంటాయి. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus