మోడల్స్ ఏడవకూడదు : ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ తో షూటింగ్ చర్చలు : మోక్షజ్ఞ రాక?

రీసెంట్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన ఎపిసోడ్ కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు తలెత్తాయి. ఒకరి నెగెటివిటీను మరొకరు బయట పెడుతూ రచ్చ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రాసెస్ జరిగింది. ఈ నేపథ్యంలో నామినేట్ చేసే సభ్యులను ఎందుకు చేస్తున్నామో వివరించే క్రమంలో వారితో అయిన మిస్ కమ్యూనికేషన్ వలన హౌస్ మేట్స్ మధ్య గొడవలు తలెత్తాయి. అయితే ఎక్కువమంది ఇంటి సభ్యులు జెస్సీను నామినేట్ చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘పవన్ క‌ల్యాణ్’ ఎపిక్ మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పునప్రారంభం కానుంది. దీనికి సంభందించి కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు తో చర్చలు జరిపారు ఈరోజు చిత్ర సమర్పకులు ఎ.ఎం. ర‌త్నం, డైరెక్టర్ క్రిష్. ‘భీమ్లా నాయక్’ చిత్రం షూటింగ్ పూర్తవగానే “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” చిత్రం షూటింగ్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రీకరించ వలసిన సన్నివేశాలు, గీతాలు, పోరాట సన్నివేశాలు, షూటింగ్ ప్రదేశాలు, నిర్మించ వలసిన భారీ సెట్స్ వంటి విషయాల గురించి చిత్ర నిర్మాత, దర్శకుల మధ్య సమాలోచనలు జరిగాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6వ తేదీ మోక్షజ్ఞ పుట్టినరోజు కాగా మోక్షజ్ఞ ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మోక్షజ్ఞ బర్త్ డేకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ ఇప్పటివరకు సినిమాల్లో నటించకపోయినా అభిమానులకు మోక్షజ్ఞపై ఊహించని స్థాయిలో అభిమానం ఉంది. గతంలో మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో అని టాలీవుడ్ స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ సైతం టికెట్ రేట్లు పెరిగితే తమ సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే అతి త్వరలో సీఎం జగన్ టాలీవుడ్ హీరోలకు శుభవార్త చెప్పనున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ టికెట్ల సమస్యకు అతి త్వరలో మోక్షం లభించనుందని సమాచారం. టాలీవుడ్ పెద్దలతో చర్చించకుండానే టికెట్ రేట్ల సవరణ జరగనుందని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్‌లో ఎప్పటి నుండో ఉన్నాయి అని అంటూనే, లేవు అనిపిస్తున్న వివాదాలు ఓ రెండు ఉన్నాయి. అందులో కామన్‌ పాయింట్‌ మెగా కుటుంబం. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ వివాదాలు ఏంటో. ఆ రెండు వివాదాల్లో ఒక దాని గురించి చెప్పే సందర్భం ఇది కాదు కాబట్టి… ఆ రెండో దాని గురించే చూద్దాం. అదే మెగా కుటుంబం – జీవితరాజశేఖర్‌. అప్పుడెప్పుడో ఏదో సినిమా రీమేక్‌ హక్కుల నుండి మధ్యలో ప్రజారాజ్యం పార్టీపై కామెంట్ల వరకు… తర్వాత ‘మా’ డైరీ ఆవిష్కరణ విషయం. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం ఉంది. తాజాగా దీనిపై జీవిత స్పందించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  


Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus