Bigg Boss 5 Telugu: ఏడిస్తే బయటకొచ్చేస్తావు.. జెస్సీపై కౌశల్ పోస్ట్!

రీసెంట్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన ఎపిసోడ్ కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు తలెత్తాయి. ఒకరి నెగెటివిటీను మరొకరు బయట పెడుతూ రచ్చ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రాసెస్ జరిగింది. ఈ నేపథ్యంలో నామినేట్ చేసే సభ్యులను ఎందుకు చేస్తున్నామో వివరించే క్రమంలో వారితో అయిన మిస్ కమ్యూనికేషన్ వలన హౌస్ మేట్స్ మధ్య గొడవలు తలెత్తాయి. అయితే ఎక్కువమంది ఇంటి సభ్యులు జెస్సీను నామినేట్ చేశారు.

కాగా.. జెస్సీ మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ తో హౌస్ లో అడుగుపెట్టారు. హౌస్ లో ఓ సందర్భంలో జెస్సీ మాట్లాడిన తీరు తమకు నచ్చలేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. నామినేషన్ సమయంలో విశ్వకు, జెస్సీకు మంధ్య జరిగిన డిస్కషన్ లో జెస్సీ బాధపడ్డాడు. ఆ తరువాత నటరాజ్ మాస్టర్ కూడా జెస్సీను నామినేట్ చేస్తూ.. ‘చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అందుకే నామినేట్‌ చేస్తున్నా’ అంటూ చెప్పగా.. వెంటనే జెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు.

దీంతో అందరూ అతడిని ఓదార్చారు. దీనిపై బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తోటి మోడల్ జెస్సీకి సపోర్ట్ గా నిలిచాడు. అతడిని ఉద్దేశిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ” నా తర్వాత, సీజన్‌ 3లో అలీ రేజా తర్వాత మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చింది నువ్వే. మోడల్స్‌ కన్నీళ్లు పెట్టకూడదు. తమ యాటిట్యూడ్‌లో ప్రేమని గెలుచుకోవాలి. అలా ఏడిస్తే మొదటగా హౌజ్‌ నుంచి ముందుగా నువ్వే బయటకు వస్తావు. జాగ్రత్తగా ఆడు. ఆల్‌ ది బెస్ట్‌” అంటూ రాసుకొచ్చాడు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus