క్లైమాక్స్ కు చేరుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ : ‘గని’ గా వరుణ్ తేజ్ : కాజల్ లిప్ లాక్ ఫోటో హల్ చల్

‘బాహుబలి'(సిరీస్) తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, రాంచరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో పాటు భీమ్ – రామరాజు చేతులు కలిపిన ఓ ఫోటోని కూడా పోస్ట్ చేశారు.

ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో.. అతని అప్-కమింగ్ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘గని’ టైటిల్ ను ఖరారు చేసినట్టు ప్రకటించారు. ఇది వరుణ్ తేజ్ కు 10వ చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రంతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘ఎఫ్3’ చిత్రం కూడా చేస్తున్నాడు వరుణ్. సూపర్ హిట్ అయిన ‘ఎఫ్2’ చిత్రానికి ఇది సీక్వెల్.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ తన పెళ్లి ఫోటోలను ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో కాజల్ తన భర్తకు లిప్ లాక్ ఇస్తున్న ఫోటో హైలెట్ గా నిలిచింది. బంధువుల సమక్షంలో కాజల్ తన భర్త గౌతమ్ కు లిప్- లాక్ ఇవ్వడం గమనార్హం.

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. తన తరువాతి చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చెయ్యబోతున్నట్టు సమాచారం.ఈ సంక్రాంతికి ‘క్రాక్’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు గోపీచంద్ మలినేని.


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus