Bigg Boss 7 Telugu: అనామకుడిగా వచ్చి అందరి వాడు అయిన యావర్..! మిస్ అయ్యిందేంటంటే..?

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం జెర్నీలతోనే గడిచిపోయింది. ఆఖరివారం హౌస్ మేట్స్ ఇంటి నుంచీ వచ్చిన ఫుడ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. జెర్నీలలో భాగంగా ఆఖరిగా యావర్ ఇంకా పల్లవి ప్రశాంత్ జెర్నీలని చూపించాడు బిగ్ బాస్. మొదట యావర్ గార్డెన్ ఏరియాలోకి రాగానే తన ఫోటోలని చూస్తూ ఎమోషనల్ అయిపోయాడు. అత్యంత ఉత్సాహపడిపోతూ ప్రతి ఫోటోని చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు, బిగ్ బాస్ ఆల్బమ్ లో తన ఫోటో ఉండటం చూసి ఆనందపడిపోయాడు. ఇక బిగ్ బాస్ జెర్నీ స్టార్ట్ చేయగానే ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

జెర్నీలో శివాజీ తో – పల్లవి ప్రశాంత్ తో ఫ్రెండ్షిప్ , గౌతమ్ తో ఆర్గ్యూమెంట్స్, అమర్ తో అరుపులు, రతికతో లవ్ ట్రాక్, శోభాతో గొడవలు ఇవన్నీ కూడా చూపించారు. అంతేకాదు, ఫస్ట్ లో తను చేసిన కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే, బిగ్ బాస్ హౌస్ లో తను ఒంటరిగా ఫీల్ అయినపుడు , తన ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులు చెప్పేటపుడు శివాజీ ఓదార్చడం అనేది జెర్నీలో హైలెట్. ఇక ఆ తర్వాత వాళ్ల బ్రదర్ ఇంట్లోకి రాగానే ఎమోషనల్ అయిపోయాడు. ఏడుస్తూ స్క్రీన్ ముందరకి వెళ్లిపోయాడు.

స్క్రీన్ ని పట్టుకుని తన బ్రదర్ ని తనివితీరా చూసుకున్నాడు. ఇంతలా భావోద్వేగానికి ఏ హౌస్ మేట్ గురికాలేదు. ఒక సామాన్యుడిగా వచ్చి, ఊరు పేరు కూడా ఎవ్వరికీ తెలియకపోయినా నన్ను ఇంతటి వాడిని చేసినందుకు బిగ్ బాస్ ని జీవితంలో మర్చిపోలేనని చెప్తూ ఏడ్చేశాడు యావర్. అంతేకాదు, కవితలు కూడా చెప్పాడు. దీనికి బిగ్ బాస్ బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఇక తిరిగి హౌస్ లోకి వెళ్లి తన అనుభూతిని అందరితో పంచుకున్నాడు. ఆతర్వాత పల్లవి ప్రశాంత్ రాగానే మంచి పాటతో వెల్ కమ్ చెప్పాడు బిగ్ బాస్. మట్టిని నమ్ముకుని ఇక్కడి వరకూ వచ్చావని చెప్పగానే పల్లవి ప్రశాంత్ కళ్లలో నీళ్లు తిరిగాయ్.

యావర్ తో కనెక్ట్ అవ్వడం, ఆ తర్వాత శివాజీ శివోపదేశం చేయడం, గురువుగారితో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడం, నామినేషన్స్ అప్పుడు గొడవలు, నాగార్జున సలహాలు ఇవన్నీ కూడా పల్లవి ప్రశాంత్ జెర్నీలో హైలెట్ గా నిలిచాయ్. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ వాళ్ల నాన్నని స్క్రీన్ పైన చూడగానే ఏడుపు వచ్చేసింది. తన జెర్నీ మొత్తం చూసుకున్న తర్వాత బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అలాగే, తనని ఇక్కడి వరకూ తీస్కుని వచ్చిన వారందరికూ కూడా థ్యాంక్స్ చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ని మొదట్లో తక్కువ అంచనా వేసిన వాళ్లు ఇప్పుడు ఖచ్చితంగా బాధపడతారు. నిజానికి శివాజీ బ్యాక్ అప్ వల్లే వీళ్ల ఇద్దరి గేమ్ దారిలో పడింది.

అందుకే, గౌతమ్ – అమర్ – శివాజీని ఫస్ట్ లో ఇదే విషయం అడుగుతుండేవారు. పల్లవి ప్రషాంత్ ఎప్పుడైతే టాస్క్ లలో గెలవడం స్టార్ట్ చేశాడో అప్పుడే నమ్మకం అనేది వచ్చింది. అయితే, రతిక వల్ల స్టార్టింగ్ దెబ్బతిన్నాడు. తనకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఫస్ట్ లో కాపాడింది. ఆ తర్వాత తన గేమ్ వల్లే గ్రాఫ్ ని పెంచుకున్నాడు రతిక ఎప్పుడైతే పవర్ అస్త్రా ని పట్టుకున్నప్పుడు తిట్టడం స్టార్ట్ చేసిందో అప్పుడు పల్లవికి విపరీతమైన హైప్ వచ్చేసింది. కోర్టు నామినేషన్స్ తర్వాత రతిక తిట్టిన తిట్లు, అలాగే పల్లవి ప్రశాంత్ డిపెండ్ చేసుకుంటూ అన్నమాటలు ఆడియన్స్ కి అలాగే గుర్తుండిపోయాయ్.

దీంతో ప్రజల్లో బాగా క్రేజ్ వచ్చింది. అయ్యోపాపం అన్నవాళ్లు అందరూ.. బాబోయ్ పల్లవి ప్రశాంత్ ఏం గేమ్ రా అంటూ పొగిడారు. అక్కడ్నుంచీ అంతా బాగా గేమ్ ఇంప్రూవ్ చేశాడు. అలాగే అమర్ తో నామినేషన్స్ , గౌతమ్ పల్లవి ప్రశాంత్ వాగ్వివాదం ఇవన్నీ కూడా పల్లవికి ఎలివేషన్ తీస్కుని వచ్చాయ్. అందుకే, హౌస్ లో ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. మరి ఇదే ఊపులో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే మాత్రం సీజన్ కి పూర్తి న్యాయం చేసినవాడు అవుతాడు. మరి చూద్దాం.. బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు అనేది..

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus