టికెట్ రేట్ పెంచినా.. కలిసొచ్చేదేమీ లేదు!

  • January 11, 2023 / 12:15 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ముందుగా ‘వీరసింహారెడ్డి’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాతి రోజు చిరంజీవి సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పటివరకు టికెట్ బుకింగ్ లు ఓపెన్ చేయలేదు. ఆంధ్రలో టికెట్ ల పెంపు జీవో ఇంకా బయటకు రాలేదు. అందుకే బుకింగ్స్ ఓపెన్ చేయలేదని తెలుస్తోంది.

నిజానికి ఈపాటికే జీవో బయటకు రావాలి. రెండు సినిమాల నిర్మాత మైత్రి మూవీస్ వారే. ఈ సంస్థ ప్రతినిధులు అమరావతిలో సీఎం పేషీ దగ్గర నిన్నంతా పడిగాపులు పడ్డారు. ఆఖరికి ‘వీరసింహారెడ్డి’ సినిమాకి రూ.20, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాకి రూ.25 వంతున టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వం నుంచి సానుకూల సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీనికి తగినట్లుగా జీవో వస్తే బుకింగ్ తెరుచుకుంటాయి. ఇదిలా ఉండగా.. ఎగ్జిబిషన్ సెక్టార్ జనాలు మాత్రం ఈ పెంపు విషయంలో సంతోషంగా లేరని తెలుస్తోంది.

ఈ పెంపు ఉన్నా, లేకపోయినా ఒకటే అంటున్నారు. ఎందుకంటే ఈ పాతిక, ఇరవై రూపాయల్లో మళ్లీ 18 శాతం జీఎస్టీ కింద ప్రభుత్వానికే ఆదాయం వెళ్తుంది. ఏదో పెంచాలని టికెట్ రేట్లు పెంచడమే తప్ప.. ఈ విషయంలో నిర్మాతగా భారీ అంకెలు కనిపించే ఛాన్స్ అయితే లేదు. ఇక ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ప్రీ సేల్స్ తోనే సంచలనం సృష్టించాయి ఈ సినిమాలు.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాయి. చిరు, బాలయ్య బాక్సాఫీస్ క్లాష్ అనేసరికి ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus