Nippu Ravva: ‘నిప్పురవ్వ’ హిందీ వెర్షన్‌కి కూడా అదే రిజల్ట్‌… కానీ!

బాలీవుడ్‌లో ఆ హీరో ఒకప్పుడు సినిమాలు చేస్తే.. వసూళ్ల లెక్క తప్ప ఇంకో మాట ఉండేది కాదు. అదేంటో కానీ ఏ సినిమా చేసినా హిట్‌ అయిపోయేది, ఫ్లాప్‌ అనే మాట కాదు కదా… కనీసం యావరేజ్‌ అనే మాట కూడా ఎప్పుడూ వినలేదు. అయితే ఇదంతా కరోనా – లాక్‌డౌన్‌ కంటే ముందు. ఇప్పుడు బాలీవుడ్‌ జనాల ఆలోచనా విధానం, సినిమాలు చూసే విధానం మారిపోయింది. దీంతో వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్నాడు. ఆ హీరో ఎవరో మీకు అర్థమైపోయుంటుంది. అవును అతనే అక్షయ్‌ కుమార్‌.

బాలీవుడ్‌ హిట్‌ మెషీన్‌గా పేరు పొందిన అక్షయ్‌… కొత్త సినిమా గత వారం వచ్చింది. ఎప్పట్లానే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే అక్షయ్‌ నటనకు ఎప్పటిలానే మంచి మార్కులు పడ్డాయి. రియల్ ఇన్సిడెంట్లు, బయోపిక్స్‌ను వెండితెరపైకి తీసుకురావాలంటే అక్షయ్‌ను మించిన వాళ్లు లేరు అంటుంటారు. అలా ఆయన గత వారం తీసుకొచ్చిన చిత్రం ‘మిషన్ రాణి గంజ్’. ఇలా అంటే మనకు పెద్దగా కనెక్ట్‌ కాకపోచ్చు. దీనికి హిందీ ‘నిప్పురవ్వ’ అంటారు అని చెప్పగానే గుర్తొచ్చేస్తుంది.

1989లో రాణిగంజ్‌ బొగ్గుగనుల్లో జరిగిన ఓ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. పశ్చిమ బెంగాల్ లో ఉన్న మహాబిర్ కాలరీలో చిక్కుకున్న 65 మంది మైనింగ్ కార్మికులను ప్రాణాలకు తెగించి కాపాడిన జస్వంత్ సింగ్ గిల్ అనే వ్యక్తి కథ ఇది. నిజానికి ఈ ఘటన ఆధారంగానే బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ సినిమాలో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీశారు. దీంతో ‘మిషన్‌ రాణిగంజ్’ను హిందీ ‘నిప్పురవ్వ’ అంటున్నారు.

ఆ పోలికతోపాటు ఫలితంలో కూడా రెండు సినిమాలు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ బాలయ్య (Nippu Ravva) ‘నిప్పురవ్వ’ పోతే… అక్కడ అక్షయ్‌ ‘మిషన్‌ రాణిగంజ్‌’ కూడా పోయింది. రెండు సినిమాల్లోనూ నటనకు హీరోలకు మంచి మార్కులే పడ్డాయి. తెలుగు విషయంలో రియాలిటీకి దూరంగా ఉందనే టాక్‌ రాగా, అక్కడ అసలు విషయం కాకుండా అక్షయ్ పాత్రను లేపడానికే ఎక్కువ ఆసక్తి చూపించడం వల్ల పోయింది అంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus