Vijay Sethupathi: వివాదంలో చిక్కుకున్న విజయ్ సేతుపతి.. ఏమైందంటే?

ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం లేకుండా పాపులారిటీని సంపాదించుకున్న నటుడిగా విజయ్ సేతుపతి పేరు తెచ్చుకున్నారు. ఒకవైపు హీరో పాత్రలను పోషిస్తూనే మరోవైపు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ నటుడిగా విజయ్ సేతుపతి సత్తా చాటుతున్నారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడి చేసిన వ్యక్తి విజయ్ సేతుపతికి క్షమాపణలు చెప్పాడని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ గొడవ అనంతరం హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ వివాదాస్పద ప్రకటన చేసింది.

విజయ్ సేతుపతి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడైన తేవర్ అయ్యను అవమానించారని ఎవరైతే విజయ్ సేతుపతిని తన్నుతారో వారికి బహుమతిని ఇస్తామని ఈ సంస్థ యొక్క చీఫ్ అర్జున్ సంపత్ బహుమతిని ప్రకటించారు. ఒకసారి విజయ్ సేతుపతిని తంతే వాళ్లకు 1,001 రూపాయలు ఇస్తామని అర్జున్ సంపత్ చెప్పుకొచ్చారు. విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పేవరకు తన్నాలని అర్జున్ సంపత్ కామెంట్లు చేశారు. విజయ్ సేతుపతిని తన్నిన మహాగాంధీ అనే వ్యక్తితో తాను మాట్లాడానని విజయ్ సేతుపతి హేళనగా మాట్లాడాడని అతను చెప్పాడని అర్జున్ సంపత్ పేర్కొన్నారు.

విజయ్ సేతుపతి ప్రపంచంలో ఏకైక దేవుడు జీసస్ మాత్రమే అని చెప్పాడని అందువల్లే మహాగాంధీ విజయ్ పై దాడి చేశాడని అర్జున్ సంపత్ పేర్కొన్నారు. ఈ వివాదం గురించి విజయ్ సేతుపతి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పలు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus