నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్ 3′(HIT 3)(హిట్ : ది థర్డ్ కేస్) రూపొందింది. ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) ఈ సినిమాను నిర్మించారు.మే 1న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. వీకెండ్ కే ఈ సినిమా 95 శాతం రికవరీ సాధించింది. జనాలు థియేటర్లు రావడం తగ్గించిన ఈ టైంలో అదీ ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే చిన్న విషయం కాదు.
అయితే వర్షాలు, ఐపీఎల్ మ్యాచ్..ల వల్ల కాబోలు ఈవెనింగ్ షో బుకింగ్స్ అనుకున్న దానికంటే తక్కువగానే ఉంటున్నాయి. మొత్తానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరువలో ఉంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 14.42 cr |
సీడెడ్ | 4.04 cr |
ఉత్తరాంధ్ర | 4.07 cr |
ఈస్ట్ | 2.06 cr |
వెస్ట్ | 1.51 cr |
గుంటూరు | 2.19 cr |
కృష్ణా | 2.04 cr |
నెల్లూరు | 0.97 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 33.30 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.76 cr |
ఓవర్సీస్ | 11.07 cr |
మిగిలిన భాషలు | 1.20 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 49.33 cr |
‘హిట్ 3’ (HIT 3 ) సినిమాకు రూ.48 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.49.33 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.89.7 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు రూ.0.33 కోట్ల షేర్ ను రాబట్టింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.