HIT3: హిట్ 3 షూటింగ్లో ఘోర విషాదం!

సినిమా పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.ఇప్పటికే .. మలయాళ సీనియర్ నటి మీనా, భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) సోదరుడు నందు, దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెన‌గ‌ల్,మలయాళ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంటీ(MT) వాసుదేవన్ నాయర్,కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి,మలయాళ నటుడు దిలీప్ శంకర్ వంటి వారు కన్నుమూశారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. టాలీవుడ్లోనే విషాదం చోటు చేసుకుంది.

HIT3 Movie

వివరాల్లోకి వెళితే… నాని (Nani)   హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu)  దర్శకత్వంలో హిట్ 3 అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ కశ్మీర్లో నిర్వహించారు. ఈ క్రమంలో ఘోర విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్న కుమారి కృష్ణ గుండెపోటుతో మరణించారు. ఈమె మెయిన్ సినిమాటోగ్రఫర్ సాను జాన్ వర్గీస్ వద్ద పనిచేస్తోంది.

కశ్మీర్లో జరిగిన షెడ్యూల్లో భాగంగా ఈమెకు ఛాతిలో నొప్పి రావడంతో.. వెంటనే శ్రీ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలించారు. ట్రీట్మెంట్ అనంతరం ఆమె కోలుకున్నట్టు కనిపించడంతో జనరల్ వార్డులోకి షిప్ట్ చేశారట. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆమెకు గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందిందని స్పష్టమవుతోంది. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఆమె అంత్యక్రియలు కేరళలోని ఆమె స్వగ్రామంలో జరగనున్నట్టు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus