HIT 3: హిట్ 3: ఆ కాంబినేషన్ పై ముందే లీక్ ఇచ్చేశారే..!

హిట్ యూనివర్స్‌లో కొత్త చాప్టర్ ప్రారంభిస్తున్న ‘హిట్ 3’ (HIT 3) సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇటీవల హైద‌రాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని (Nani)  హీరోగా నటించిన ఈ సినిమా ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయడం, అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. విశ్వక్ సేన్ (Vishwak Sen)  , అడివి శేష్ (Adivi Sesh) వంటి హిట్ యూనివర్స్ హీరోలు కూడా ఈ వేడుకలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఈవెంట్‌లో ఓ ముఖ్యమైన లీక్ బయటకు రావడం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.

HIT 3

ఈ లీక్‌ను బయటకు తీసిన వ్యక్తి మరెవరో కాదు, హిట్ 3 ఫైట్ మాస్టర్ సతీష్. ఆయన శ్రీనిధి శెట్టి  (Srinidhi Shetty) చేసిన ఫైట్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ, అనుకోకుండా అడివి శేష్ కూడా ఒక యాక్షన్ సీన్‌లో భాగం అయ్యాడని వెల్లడి చేశాడు. ఈ విషయంలో షైలేష్ కొలను (Sailesh Kolanu) కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. యాంకర్ సుమ (Suma)  సతీష్‌ను సరదాగా కవర్ చేయాలనుకున్నా, అప్పటికే ఆ రహస్యం బహిర్గతం అయ్యింది.

ఫైట్ మాస్టర్ మాటలతో, అడివి శేష్ హిట్ 3లో కనిపించబోతున్నారని అభిమానులు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు. ఈవెంట్‌లో అడివి శేష్ కూడా తన ప్రసంగంలో హిట్ 3 చివరి 30 నిమిషాలు చూశానని, ఆ భాగం థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పారు. మరీ అంత ప్రత్యేకంగా చెబుతుండటంతో, ఆయన పాత్ర సినిమాకు కీలక మలుపు తీసుకొచ్చేలా ఉండనుందనే అంచనాలు పెరిగాయి. సమాచారం ప్రకారం, శేష్ పోరాట సన్నివేశం జమ్మూ కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, నానితో కలిసి శత్రువులను ఎదుర్కొనే విజువల్ గ్రాండియర్ సీన్‌గా తెరకెక్కించారని అంటున్నారు.

ఇక నాని కూడా “ఈ సినిమా విజయోత్సవ వేడుకలోనే స్పెషల్ వ్యక్తుల గురించి మాట్లాడతాను” అని చెప్పడం, లీక్‌లను మరింత బలపరిచింది. దీంతో శేష్ కేమియోపై అంచనాలు మరింత పెరిగాయి. విశ్వక్ సేన్ గురించి కూడా చిన్నగా చర్చ జరుగుతున్నప్పటికీ, ఇప్పటికి ఆయన పాత్రపై క్లారిటీ లేదు. ఫైనల్‌గా, హిట్ 3లో హీరోల టీమ్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus