Sailesh Kolanu: 10వ పెళ్లి రోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన ‘హిట్’ డైరెక్టర్ శైలేష్ కొలను..!

శైలేష్ కొలను.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఉండరు.. ఫస్ట్ ఫిలిం ‘హిట్ : ది ఫస్ట్ కేస్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. పేరుకి తగ్గట్టే సాలిడ్ థ్రిల్లర్‌తో ఆడియన్స్‌ని మెప్పించి.. డైరెక్టర్‌గా తన అభిరుచిని చాటుకున్నారు.. ఈ మూవీని రాజ్ కుమార్ రావుతో బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్కడ కూడా ‘హిట్’ కొట్టారు.. విదేశాల్లో చదువు, డాక్టర్ వృత్తి, లగ్జరీ లైఫ్ స్టైల్ వంటి వాటిని త్యాగం చేసి.. ప్యాషన్‌తో సినిమా ఫీల్డ్‌కి వచ్చిన శైలేష్..

ఈ మధ్య కాలంలో వరుసగా రెండో హిట్, అది కూడా సీక్వెల్‌తో కొట్టడం విశేషం.. ఇటీవల ‘హిట్ : ది సెకండ్ కేస్’ వంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు.. ఈ రెండు సినిమాలను నేచురల్ స్టార్ నాని నిర్మించిన సంగతి తెలిసిందే.. ‘హిట్’ ఫ్రాంఛైజీలో ఇలాంటి థ్రిల్లర్స్ మొత్తం ఏడు రానున్నాయంటూ టాలీవుడ్‌లో ‘హిట్’ యూనివర్స్ క్రియేట్ చేశారు.. ప్రస్తుతం టీంతో కలిసి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

అడివి శేష్, మీనాక్షి చౌదరిలతో కలిసి రాజమండ్రితో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి ప్రేక్షకులతో ఆనందాన్ని పంచుకుంటున్నారు.. నానితో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ లాభాలు చూస్తున్నారు.. రెండో వారంలోనూ థియేటర్లలో క్రౌడ్ ఫుల్ అవుతుందీ సినిమా.. కాగా.. ఇవాళ (డిసెంబర్ 9) శైలేష్ కొలను పెళ్లి రోజు.. ఈ సందర్భంగా భార్య స్వాతితో పాటు కుమారుణ్ణి నెటిజన్లకు పరిచయం చేస్తూ.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు..

ఇది శైలేష్ 10వ పెళ్లి రోజు.. ‘‘17 ఏళ్ల పరిచయం.. పదేళ్ల వైవాహిక జీవితం.. స్వాతి లేకపోతే ఈరోజు వచ్చేది కాదు.. ‘హిట్ 2’ విజయాన్ని స్వాతికి అంకితమిస్తున్నాను’’ అంటూ ఫ్యామిలీతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్ షేర్ చేశారు.. ఈ సందర్భంగా ‘హిట్’ సినిమాల టీమ్ మెంబర్స్, సినీ ప్రముఖులు, నెటిజన్లు స్వాతి, శైలేష్ దంపతులకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలియజేస్తున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus