టాలీవుడ్‌కి సాలిడ్ షాక్ ఇచ్చిన ఆ సినిమాల ఫలితాలు ఏంటంటే?

  • December 13, 2022 / 12:35 PM IST

ప్రతివారం కొత్త సినిమాలతో థియేటర్లు కళకళాలాడుతూనే ఉన్నాయి.. ఎప్పటిలానే డిసెంబర్ రెండో వారంలోనూ న్యూ మూవీస్ బాక్సాఫీస్ బరిలోకి దిగాయి.. ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 15 సినిమాలు వచ్చాయి.. ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్‌గా అనిపించడంతో.. ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. కథలో కంటెంట్ ఉండే ఉంటుంది అనే బజ్ తెచ్చుకున్నాయి. మరో మూడు వారాల్లో 2022 కంప్లీట్ అయిపోతుంది.. ఈ చిత్రాలతో చివరినెల పాజిటివ్‌గా స్టార్ట్ అవుతుంది.. హ్యాపీ ఎండింగ్‌కి హెల్ప్ అవుతాయి అనుకుంటే.. సాలిడ్ షాక్ ఇచ్చాయి.. డిసెంబర్ సెకండ్ వీక్‌లో విడుదలైన సినిమాలు, వాటి ఫలితాల తాలుకు వివరాలు ఇలా ఉన్నాయి..

‘కలర్ ఫోటో’ వంటి డెబ్యూ మూవీతో ఆకట్టుకుని, నేషనల్ అవార్డ్ విన్ అయిన సందీప్ రాజ్ కథతో, గంగాధర్ దర్శకత్వంలో.. వికాస్ వశిష్ఠ – ప్రియా వడ్లమాని జంటగా తెరకెక్కించిన ‘ముఖచిత్రం’.. విశ్వక్ సేన్ ఇంపార్టెంట్ రోల్ చేశాడు.. ‘బొమ్మాళీ’ రవి శంకర్, చైతన్య రావు తదితరులు నటించగా.. కాల భైరవ సంగీతమందించాడు.. మహిళలకు నచ్చే ఎమోషనల్ కంటెంట్ ఉంది అనే టాక్ వచ్చినా కానీ ఆకట్టుకోలేక పోయింది..

టాలెంటెడ్ యాక్టర్‌గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సత్య దేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మేఘ ఆకాశ్, కావ్య శెట్టి తదితరులు నటించిన డిఫరెంట్ లవ్ స్టోరీ ‘గుర్తుందా శీతాకాలం’.. కన్నడ బ్లాక్ బస్టర్ ‘లవ్ మాక్‌టైల్’ రీమేక్‌గా.. నాగ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా చడీ చప్పుడు చేయలేకపోయింది..

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రల్లో.. ఐదు డిఫరెంట్ కథలతో ‘పంచతంత్రం’ వచ్చింది.. హర్ష పులిపాక డైరెక్ట్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నంతగా సినిమా అలరించలేదనే చెప్పాలి..

రెండో వారంలో వచ్చిన సినిమాలన్నీ సాలిడ్ షాక్ ఇవ్వడంతో టాలీవుడ్ ఆశ్చర్యపోయింది.. వేరే మార్గం లేకపోవడంతో.. అడివి శేష్ ‘హిట్ 2’ మూవీనే ఇంకా చూస్తూ ఉన్నారు.. ‘అవతార్ 2’ తో పాటు మరికొన్ని సినిమాలతో థర్డ్ వీక్ స్టార్ట్ కానుంది..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus