Hombale Films: హోంబలే ఫిలిమ్స్ భారీ ప్లాన్!

  • December 24, 2022 / 02:39 PM IST

కన్నడ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలను నిర్మించడం మొదలుపెట్టి ఆ తరువాత ‘కేజీఎఫ్’ లాంటి పెద్ద రేంజ్ సినిమాను నిర్మించింది హోంబలే ఫిలిమ్స్ సంస్థ. రీసెంట్ గా ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘కాంతారా’ సినిమా ఊహించని విధంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. దీంతో హోంబలే ఫిలిమ్స్ స్థాయి మరింత పెరిగింది. త్వరలోనే ఈ బ్యానర్ నుంచి రాబోతున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన హోంబలే ఫిలిమ్స్ తమ ఫ్యూచర్ ప్లాన్స్ ను ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో తమ సంస్థ నుంచి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హోంబలే ఫిలిమ్స్ అధినేతల్లో ఒకరైన విజయ్ కిరగందూర్ ప్రకటించారు. కేవలం కన్నడలోనే కాకుండా దక్షిణాదిన అన్ని భాషల్లో హోంబలే ఫిలిమ్స్ రాబోయే రోజుల్లో సినిమాలను నిర్మించనుందని తెలిపారు. ఫ్యూచర్ లో ఇండియాలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మరింతగా విస్తరిస్తుందని..

అభివృద్ధి చెందుతుందని.. అందుకే తాము నిర్మాణాన్ని విస్తరిస్తున్నామని విజయ్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.3 వేళా కోట్ల పెట్టుబడులు పెడతామని.. ప్రతి ఏడాది ఐదారు సినిమాలు నిర్మిస్తామని.. అందులో ఒకటి ఈవెంట్ ఫిలిం ఉంటుందని అన్నారు. విభిన్నమైన కథలను తెరపైకి తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా దక్షిణాది భాషల్లో సినిమాలను నిర్మిస్తామని..

‘కాంతారా’ తరహాలో మన సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో అవి ఉండేలా చూసుకుంటామని తెలిపారు. అలానే అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చేలా ఆ సినిమాలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇండియన్ ఎకానమీకి కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus