కాలేజీ టాప్ స్టూడెంట్ అయినా జాబ్ కావాలంటే ఇంటర్వ్యూ పాస్ అవ్వాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఎంత కోపం వచ్చినా.. క్లాస్ రూం లో జోకులు వేసినట్లు అక్కడ వేయలేము. నవ్వును తెచ్చుకుని వారిని ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తాం. ఇంటర్వ్యూయర్ కి అభ్యర్థులు నచ్చకపోయినా.. చెప్పేవి అబద్దమని తెలిసినా హుందాగా కూర్చొని వింటుంటారు. దాదాపు అన్ని ఉద్యోగాలకు జరిగే ఇంటర్వ్యూ లు ఇలాగే ఉంటాయి. ఇద్దరూ నిజాలు మాట్లాడుకుంటే ఎలాగుంటుందో మహాతల్లి చాలా ఫన్నీగా తన లేటెస్ట్ క్యూట్ ఫిల్మ్ “హానెస్ట్ ఇంటర్వ్యూ స్” ద్వారా చూపించారు.
ప్రశ్నలు ఏమిటంటే..
జాబ్ ఎక్స్ పీరియన్స్ ఉందా? , నీ గురించి చెప్పు ?, మీ ఇష్టమైన జాబ్ ఏంటి ?, మీ బలం, బలహీనతలు ఏమిటి?, ఈ జాబ్ నీకెందుకు అవసరం ?, ఎందుకు పని చేయాలనుకుంటున్నావు ?, ఐదేళ్లలో నీ లక్ష్యం ఏమిటి?, ఎందుకు నిన్ను మేము తీసుకోవాలి ?, ఎంత శాలరీ కావాలి ? … ఈ ప్రశ్నలు చదువుతుంటే .. మీరూ వీటికి ఎప్పుడో సమాధానం చెప్పినట్లుగా ఉంది కదూ.. ఎస్.. ఈ ప్రశ్నలు అన్నిఇంటర్వ్యూలలో కామనే. కానీ మహాతల్లి చెప్పిన సమాధానాలే స్పెషల్. ఉదాహరణకు మీరు లైఫ్ లో చేసిన గొప్ప పని/సాధించిన విజయం గురించి చెప్పమంటే… పాలు పొంగుని ఆపిన సందర్భం గురించి జాహ్నవి చెప్పడం.. చెప్పేటప్పుడు ఉన్న సీరియస్నెస్ చూస్తే నవ్వు ఆపుకోలేము. ఇలా ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకు వినూత్నంగా సమాధానం చెప్పి మాహాతల్లి తన స్టయిల్ లో ఫన్ ని క్రియేట్ చేసింది.