ప్లాప్ సినిమాతో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన హీరో..!

ఇప్పటి కాలంలో హిట్టైన సినిమాకే కలెక్షన్లు వచ్చి బ్రేక్ ఈవెన్ అవుతుందన్న గ్యారంటీ లేదు. రివ్యూలు ఎంత పాజిటివ్ గా వచ్చినా ఒక్కోసారి తేడా కొట్టేస్తుంటుంది. మన తెలుగులో చూసుకుంటే ‘ధృవ’ ‘భరత్ అనే నేను’ ‘అరవింద సమేత’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి స్టార్ హీరోల సినిమాలకి సూపర్ హిట్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. వచ్చిన టాక్ కు కలెక్షన్లకు సంబంధం లేదనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక హిందీ సినిమాలకి కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

అక్కడ హిట్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్లు రాబట్టలేని సినిమాలు అనేకం ఉన్నాయి. అయితే అక్షయ్ కుమార్ మాత్రం డిజాస్టర్ టాక్ తో ఏకంగా 200 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఆయన హీరోగా నటించిన ‘హౌస్ ఫుల్4’ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. అక్కడి క్రిటిక్స్ కూడా సినిమాకి కేవలం 1.5 రేటింగ్ లు ఇచ్చి సినిమా బాలేదంటూ ఏకిపారేశారు. అయినప్పటికీ సినిమా కలెక్షన్లు మాత్రం ఆగలేదు. ఏదో ఓపెనింగ్స్ వస్తాయిలే అనుకుంటే.. 200 కోట్ల కల్లెక్షన్లని వసూల్ చేసింది. అక్షయ్ గత 9 చిత్రాలు హిట్లే కావడంతో ఈ సినిమా కూడా బాగుంటుంది అని జనాలు ఎగబడి చూసారు. ఈ చిత్రం బాగా కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించడంతో 10 వ హిట్ ను కూడా తన అకౌంట్ లో వేసుకున్నాడు అక్షయ్. ఈ రకంగా సరికొత్త రికార్డ్ సృష్టించాడు అక్షయ్.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus