Adipurush: బాలీవుడ్‌ తలచుకుంటే ఇలా ఉంటుంది.. రాజమౌళి చూస్తున్నారా?

టాలీవుడ్‌లో సినిమా తీయాలంటే చాలా మంది దర్శకులు ఉన్నారు. భారీ సినిమాలు తీయాలంటే కొంతమంది దర్శకులు ఉన్నారు. కానీ ఎలాంటి సినిమా తీసినా దానిని అదిరిపోయే రేంజిలో ప్రచారం చేయాలంటే చాలా తక్కువమంది ఉన్నారు అనొచ్చు. అలాంటి తక్కువ మందిలో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ సినిమాలు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆయన అండ్‌ టీమ్‌ చేసిన ప్రచారం అలాంటిది మరి. దేశంలో ఏ మూలన చూసినా.. ఆ సినిమాల గురించే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అది ప్రపంచవ్యాప్తం అయిపోయింది. అయితే ఇవేవీ చేయకుండానే ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడు నడుస్తున్నది ‘ఆదిపురుష్‌’ (Adipurush) సీజన్‌ కాబట్టి… మేం చెబుతున్నది ఆ సినిమా గురించే అని మీకు ఈజీగా అర్థమైపోతుంది. కావాలంటే మీరే చూడండి… సినిమా టీమ్‌ నుండి ఒక్కరు బయటకు రావడం లేదు. ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. రికార్డెడ్‌ ప్రోగ్రామ్‌, చర్చలు బయటకు రావడం లేదు. టీజర్‌, ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తప్ప ఇంకేమీ జరగలేదు. కానీ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దీంతో రాజమౌళికి కానిది వీరికి ఎలా సాధ్యమైంది అనే చర్చ మొదలైంది.

సినిమాకు సంబంధించి ఏ పనులను టీమ్‌లు ఇప్పుడు చేయడం లేదు. సినిమా రెడీ చేసి విడుదలకు సిద్ధమైపోయారు. అంతా జరుగుతున్నది సోషల్‌ మీడియాలోనే. ఉచితంగా టికెట్లు ఇస్తున్నారు అనే ఒక్క మాటే సినిమాకు ప్రచారం. ఇది కాకుండా ప్రతి థియేటర్‌లో హనుమాన్‌కు స్పెషల్‌ సీటు లాంటి కొన్ని ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రచార పర్వంలో కనిపిస్తున్న అంశాలు ఇవి మాత్రమే. ఇంత తక్కువగా ప్రచారం చేసినా సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ వస్తాయి అంటున్నారు.

తొలి రోజు సుమారు 85 కోట్ల రూపాయలు వసూళ్లు వస్తాయని టాక్‌. దీంతో (Adipurush) ఈ సినిమాను చూసి రాజమౌళి లో కాస్ట్‌ ప్రచారం అంటే ఏంటో తెలుసుకోవాలి అనే ఛలోక్తులు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ప్రచారం ఖర్చు చాలా తక్కువ. అయితే సినిమా విడుదలయ్యాక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారనే చర్చ కూడా ఉంది. చూడాలి ఈ విషయం 17 నుండి తెలుస్తుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus