కమర్షియల్ సినిమాల్లో ఎన్ని తప్పులైనా జరగొచ్చు కానీ.. చారిత్రాత్మక చిత్రాల విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం చిన్నపాటి తప్పు దొర్లినా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి విషయంలో అదే జరుగుతోంది. సినిమా బాగున్నా, చిరంజీవి నటన బాగున్నా.. సినిమా ఎండ్ టైటిల్ కార్ఱ్స్ లో పేర్కొన్న స్వాతంత్ర సమయోధుల పేర్లు, ఫోటోలు బాగున్నా..
అందులో మన తెలుగు విప్లవ వీరుడు అయిన అల్లూరి సీతారామరాజు ఫోటో కానీ పేరు కానీ ఆ ఎండ్ టైటిల్స్ లో కనిపించకపోవడాన్ని కొందరు చాలా పెద్ద తప్పుగా పరిగణిస్తున్నారు. అందులోనూ.. ఇప్పుడు చరణ్ “ఆర్.ఆర్.ఆర్” సినిమాలో అల్లురి సీతారామరాజు పాత్ర పోషిస్తుండడం కూడా ఇక్కడ గమనార్హమైన విషయం కావడంతో.. ఆయన పాత్ర పోషిస్తూనే ఆయన్ను ఎలా మర్చిపోయావ్ అని ట్విట్టర్లో చరణ్ ను ట్రోల్ చేస్తున్నారు ఇంకొందరు. అయితే.. ఇది మరీ ఏకిపాడేసేంత పెద్ద తప్పేమీ కాదు. అలాగని చిన్న పొరపాటు కూడా కాదు. మరి చిత్రబృందం ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకొంటుంది అనేది చూడాలి.