Chandramukhi2: ‘చంద్రముఖి 2’ టీం ఈ లాజిక్ ఎలా మిస్సయ్యింది..?

రజినీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ సక్సెస్ అందుకుంది. సౌత్ లో అప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా కూడా రికార్డులు సృష్టించింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అతి ముఖ్యమైన పాత్రలో జ్యోతిక నటించింది. ఆమెకు జోడీగా ప్రభు నటించాడు.

విద్యాసాగర్ సంగీతంలో రూపొందిన పాటలు, కామెడీ, రజినీకాంత్ నటన, క్లైమాక్స్.. సినిమాకి హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ చిత్రానికి రెండో భాగంగా ‘చంద్రముఖి 2’ కూడా రూపొందిన సంగతి తెలిసిందే. లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాకి కూడా పి.వాసునే దర్శకుడు. ఇక ‘చంద్రముఖి’ పాత్రలో కంగనా రనౌత్ నటించింది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ‘చంద్రముఖి 2’ లో కంగనా ఒరిజినల్ చంద్రముఖిగా కనిపించింది అని చెప్పారు.

‘చంద్రముఖి’ సినిమాలో జ్యోతికని చంద్రముఖి (Chandramukhi2) ఆవహించినట్టు మాత్రమే చూపించారు కానీ ఆమెనే ఒరిజినల్ చంద్రముఖి అన్నట్లు చూపించలేదు. కానీ పార్ట్ 2 లో ఒరిజినల్ చంద్రముఖి గా కంగనా కనిపిస్తుందని ప్రమోషన్స్ లో దర్శకులు పి.వాసు తెలిపారు. అయితే పి.వాసు తెరకెక్కించిన ‘నాగవల్లి’ సినిమాలో కూడా ‘చంద్రముఖి’ కథని చూపించారు. అందులో చంద్రముఖిగా అనుష్కని చూపించారు. ఆమె హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ ను ఆవహించినట్టు చూపించారు.

మరి ఒరిజినల్ ‘చంద్రముఖి’ అనుష్క అవుతుంది కానీ కంగనా ఎందుకు అవుతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ పి.వాసు అండ్ టీం మాత్రం ‘నాగవల్లి’ … కన్నడలో రూపొందిన ‘ఆప్త రక్షక’ కి రీమేక్ మాత్రమే అంటూ కవర్ డ్రైవ్ ఆన్సర్ ఇచ్చారు. ‘చంద్రముఖి’ రెండో భాగం ‘చంద్రముఖి 2’ మాత్రమే అని వారు చెబుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus