అలీ షో వెనుక అంత కథ ఉందా.. సెలబ్రిటీలు కూడా ఊరికే రారు..!

ఈ మధ్య కాలంలో బుల్లితెర పై టెలికాస్ట్ అయ్యే టాక్ షోలకు కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే ఓటిటి సంస్థలు కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లను పెట్టి ఇలాంటి టాక్ షోలు నిర్వహించడానికి ముందుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. బుల్లితెర పై బాగా పాపులర్ అయిన టాక్ షోలలో ‘అలీతో సరదాగా’ కూడా ఒకటి. స్టార్ కమెడియన్ అలీ ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు.తనదైన శైలిలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూనే.. మరోపక్క కామెడీ డైలాగులు కూడా పేలుస్తుంటాడు అలీ.

ఈ షోకి కొత్త ఆర్టిస్ట్ లే కాదు పాత సినిమాల్లో నటించిన ఆర్టిస్ట్ లు కూడా వస్తుంటారు. అందరూ తెలిసిన వాళ్ళే అవ్వడంతో అనుకుంట, అలీ.. కొన్ని సీరియస్ ప్రశ్నలను కూడా సిల్లీగా అడిగేసి ఆన్సర్ రప్పించుకుంటూ ఉంటాడు. టీవీల్లో ప్రసారమయ్యేటప్పుడు ఈ ఎపిసోడ్స్ ను తక్కువ మంది వీక్షించినా… యూట్యూబ్ లో మాత్రం చాలామంది ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు.అయితే ‘ఈ షోకి గెస్టులు గా వచ్చే వాళ్లు ఫ్రీగానే వస్తారా లేక డబ్బులు తీసుకుని వస్తారా?’ అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.

అయితే దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాధానం అందింది. అదేంటంటే.. ఈ షోకి గెస్టులు వచ్చేవాళ్ళకి ఒక్కో ఎపిసోడ్ కు లక్ష రూపాయలు ఇస్తారట. వాళ్ళు స్టార్ లు అయితే మరింత పెంచి ఇస్తారని సమాచారం. అంతేకాకుండా వాళ్ళకు ఫ్లైట్ టికెట్లు.. హోటల్ ఖర్చులు .. షో పూర్తయ్యే వాళ్లకు సంబంధించిన అవస్రతలను నిర్మాతలే చూసుకుంటారట. అయితే మరికొంత మంది సినిమా ప్రమోషన్ల కోసం ఫ్రీగా కూడా వస్తుంటారని తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus