Prabhas: ప్రభాస్‌కి పెద్ద చిక్కు వచ్చి పడిందే… ఎలా ప్లాన్‌ చేస్తాడో ఏంటో?

తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్‌ చేస్తుంటారు. ప్రస్తుతం మన స్టార్‌ హీరోల పరిస్థితి చూస్తుంటే ఏడాదికో సినిమా అనేలా తయారైంది. కానీ కొంతమంది హీరోలు మాత్రం వరుసగా సినిమాలు ఓకే చేసేస్తూ పట్టాలెక్కించేస్తున్నారు. అలాంటివారిలో ప్రభాస్‌ ఒకరు. ఇప్పుడు ప్రభాస్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇప్పుడు ఇదే ఓ సమస్యగా మారింది అంటున్నారు. సినిమా రిలీజ్‌ డేట్‌ల విషయంలోనూ ఈ సమస్య అంతా వచ్చింది అని చెప్పొచ్చు.

అదేంటి.. సినిమా విడుదల చేస్తామంటే ఇబ్బంది ఏం ఉంది? థియేటర్లు సిద్ధంగా ఉంటే చాలు.. అభిమానులు ఆటోమేటిగ్గా వచ్చేస్తారు కదా థియేటర్లకు అంటారా? అవును నిజమే.. అయితే ఇక్కడ సమస్య థియేటర్లు కాదు, జనాలు కాదు. ప్రభాస్‌ కాల్‌షీట్లు. అవును.. సినిమా షూటింగ్‌ చేశామా? పూర్తియిందా? వెళ్లిపోయామా అనుకునే రకమైతే ప్రభాస్‌.. ఈ సమస్య లేకపోయుండేది. సినిమా రిలీజ్‌ అన్నాక ప్రచారంలో పాల్గొనాలి. దాని కోసం ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్‌ కష్టమవుతోంది అంటున్నారు.

ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుత సినిమాల సంగతి చూస్తే… ‘ఆదిపురుష్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సలార్‌’ చివరి దశకొచ్చింది. ‘ప్రాజెక్ట్‌ కె’ ఇంకా కొనసాగుతోంది. ఇవి కాకుండా మారుతితో ఓ సినిమా ఉంది. అలా ప్రస్తుతం ప్రభాస్‌ రూ. 1500 కోట్లకుపైగా బిజినెస్‌ కేరాఫ్‌ అడ్రెస్‌గా మారాడు. దీంతో ఈ సినిమాల విజయం ఇండస్ట్రీకి కూడా చాలా అవసరం అయిపోయింది. అయితే వీటి విడుదల సందర్భంగా ప్రచారం కోసం ప్రభాస్‌ ఇటొస్తే.. మిగిలిన సినిమాలకు డేట్స్ ఇవ్వలేడు కదా అనే డౌట్ వస్తోంది.

‘ఆదిపురుష్‌’ను వచ్చే నెల 16న విడుదల చేస్తారు. ఆ సినిమా ప్రచారం చూసుకున్న వెంటనే ‘సలార్‌’ పనులు చూసుకోవాలి. ఆ వెంటనే ప్రచారం పనులు చూసుకోవాలి. అది అయిపోయిన వెంటనే మారుతి సినిమా సంగతి చూడాలి. ఈ లోపు ‘ప్రాజెక్ట్ కె’ ఉంటుంది. ఇలా వరుసగా ఇంత టఫ్‌ డేట్స్‌ అడ్జెస్ట్‌మెంట్‌ ఎలా చేస్తారు అనేదే ప్రశ్న. ఒక్కో సినిమా మధ్య కనీసం మూడు నెలల గ్యాప్‌ ఉండాలి కదా అనే చర్చ కూడా టీమ్‌ల మధ్య నడుస్తోందట.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus