దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలను జనాలు థియేటర్లలోనే రెండు, మూడు సార్లు చూస్తుంటారు. ఒకవేళ థియేటర్లో ఒకసారే చూసినా.. ఓటిటిలో రిలీజ్ అయ్యాక ఓసారి, టీవీల్లో ప్రీమియర్ టెలికాస్ట్ అయ్యేప్పుడు ఓసారి ఇలా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే రాజమౌళి టేకింగ్ సాధారణంగా ఉండదు,ఏళ్ళకి ఏళ్ళు కష్టపడి సినిమాలు తీస్తుంటాడు, అతని సినిమాల్లో భారీతనం నిండుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే రాజమౌళి సినిమాలపై జనాలకి వ్యామోహం ఎక్కువ. అయితే ఇలా ఎక్కువ సార్లు చూడటం వలనో ఏమో కానీ ప్రేక్షకులు కొన్ని తప్పులు కూడా కనిపెడుతూ ఉంటారు.
తాజాగా చరణ్,ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో కూడా జనాలు కొన్ని తప్పులు కనిపెట్టారు. అది రాజమౌళి చేసిన పొరపాటా.. లేక తానేమి చేసినా జనాలు పట్టించుకోకుండా చూస్తారు అనే గర్వామా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ రాజమౌళికి నిజంగానే గర్వం ఉన్నా తప్పుపట్టనవసరం లేదు అనేది కొందరి వాదన. సరే ఇంతకీ ‘ఆర్.ఆర్.ఆర్’ లో జరిగిన తప్పేమిటి అనే విషయంలోకి వచ్చేద్దాం. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రని పోషించాడు.
అయితే ఓ సందర్భంలో అక్తర్ గా మారు వేషం కట్టి మెకానిక్ గా మారతాడు. ఈ క్రమంలో ఆయన 20ల కాలం నాటి ఓ బైక్ వాడుతూ ఉంటాడు. అయితే ఈ బైక్ కొన్ని కొన్ని సన్నివేశాల్లో రకరకాల నంబర్స్ కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని కనిపెట్టిన నెటిజన్లు ‘రాజమౌళి ఇంత లాజిక్ ఎలా మిస్ అయ్యాడు’ అంటూ వాళ్ళు ఏదో సాధించేసినట్టు ఫీలైపోతున్నారు. ఈ సినిమా విడుదల టైములో ఇలాంటి మిస్టేక్స్ ను వాళ్ళు కనిపెట్టలేదు అంటే అది రాజమౌళి టేకింగ్ మ్యాజిక్ అనే చెప్పాలిగా..!
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!