‘ఆర్ఆర్ఆర్’ సినిమా కీ పాయింట్, మెయిన్ పాయింట్… ఇలా కొన్ని పాయింట్ల లిస్ట్ రాసుకుంటే అందులో ఒకటిగా ఉంటుంది మేం ఇప్పుడు చెప్పబోయే డైలాగ్. సినిమాలో తెల్ల దొర స్కాట్ బక్స్‌టన్ వివిధ సందర్భాల్లో ఓ డైలాగ్ వేస్తాడు. ఇంకొక తెల్లదొర నోట కూడా ఆ డైలాగ్ వినిపిస్తుంది. గన్ బులెట్ కంటే, భారతీయుడి ప్రాణం విలువ తక్కువ అనే అర్థంతో ఆ డైలాగ్ రాసుకొచ్చారు. అయితే ఈ డైలాగ్ దగ్గరే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పొచ్చు.
సినిమా స్వాతంత్ర్యం కంటే ముందు జరిగిన కథగా తెరకెక్కిన విషయం తెలిసిందే. దీంతో సినిమాలో కొన్ని ఇంగ్లిష్ డైలాగ్స్ ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ వచ్చినప్పుడు బ్యాగ్రౌండ్ వాయిస్‌తో అర్థం చెప్పారు. అయితే కొన్ని డైలాగ్స్ విషయంలో మాత్రం నేపథ్యంలో వాయిస్ వినిపించదు. దీంతో ఆ నటుడు ఏమన్నాడో తెలియక ప్రేక్షకులు తికమకపడుతున్నారు. ఓటీటీలు, సిటీల్లో ఈ సమస్య ఉండకపోవచ్చు కానీ.. బీ, సీ సెంటర్లలో చాలా చోట్ల ఈ సమస్య వస్తోందట.
సినిమా మెయిన్ పాయింట్స్‌లో ఒకటైన ఆ బులెట్ డైలాగ్ విషయంలో మరి రాజమౌళి ఎందుకు సబ్ టైటిల్స్ కూడా వేసే ప్రయత్నం చేయలేదు అని అంటున్నారు నెటిజన్లు. అలాగే స్కాట్ బక్స్‌టన్, లేడీ బక్స్‌టన్ మాట్లాడే మాటల విషయంలో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపించింది అని చెప్పొచ్చు. భీమ్ పాత్రధారి అయిన తారక్‌ను ముళ్ల కొరడాతో కొట్టమని చెప్పేటప్పుడు పోల్‌కి ముందుకు కొట్టు.. అప్పుడు ఈ కొరడా పనితనం ఏంటో అందరికీ తెలుస్తుంది అంటుంది. ఈ మాటలు సబ్‌టైటిట్స్‌గాను రాలేదు, అలాగే బ్యాగ్రౌండ్ వాయిస్ కూడా రాలేదు.
ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే రాజీవ్ కనకాల పాత్ర కనిపించినప్పుడు మాత్రమే బ్యాగ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత మరో రెండుసార్లు వస్తుంది. జెస్సీ (ఒలీవియా మోరిస్) విషయంలో కూడా ఇదే పరిస్థితి. భీమ్‌తో ఆమె చెప్పే డైలాగ్‌లు భీమ్‌కి అర్థం కావు, చూసే ప్రేక్షకులకు కూడా. సినిమా అన్నాక అన్ని లాజిక్‌లు చూసుకునే రాజమౌళి ఈ విషయంలో ఎందుకు లాజిక్ మరచిపోయారో అర్థం కావడం లేదు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?