ఈయన్ని ‘ప్రభాస్ శ్రీను’ అని ఎందుకంటున్నారు… ప్రభాస్‌కి ఏమన్నా బంధువా? లేక ఈయన ప్రభాస్ ఫ్యానా? లేక గుర్తింపు కోసం పెట్టుకున్నారా? నటుడు శ్రీనును చూసినప్పుడల్లా చాలామందికి ఇలానే అనిపిస్తుంటుంది. మీకూ ఇలానే అనిపించిందా? ఎప్పుడైనా? అయితే దీనికి సమాధానం ఆయన గతంలోనే ఒకసారి చెప్పాడు. ఆ మాటలు మరోసారి చూద్దాం. ఇందులో అసలు శ్రీను… ప్రభాస్ శ్రీను ఎలా అయ్యాడు? ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి అనేది తెలిసిపోతుంది.
ప్రభాస్ శ్రీనుకు చిన్నప్పటి నుండి చదువు పెద్దగా అబ్బలేదట. సాంస్కృతిక కార్యక్రమాలంటే ఆసక్తి ఎక్కువట. యాక్టింగ్, ఇతర కల్చరల్ యాక్టివిటీస్‌లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాడట. ఇదే విషయాన్ని ఆయన తండ్రి… తన స్నేహితుడికి చెప్పడంతో ‘మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’లో చేరమన్నారట. అలా నటనలో శిక్షణ తీసుకున్నారట. శిక్షణ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన ప్రభాస్ శ్రీనుకు పెద్దగా అవకాశాలు ఏవీ రాలేదట. సత్యానంద్ గారి దగ్గర కూడా శిక్షణ తీసుకుంటే బాగుంటుందని ప్రభాస్ శ్రీనుకు అనిపించిందట.
అయితే, ఆయన తక్కువ మందికే శిక్షణ ఇస్తారనే విషయం తెలిసిందట. అయితే ప్రభాస్ శ్రీను తండ్రి రిక్వెస్ట్ చేస్తే, సత్యానంద్ ఆయన ట్రైనింగ్ ఇచ్చారట. ఆ బ్యాచ్‌లో నలుగురం ఉండేవాళ్లట. అందులో ప్రభాస్ ఒకరు. అలా ప్రభాస్, ప్రభాస్ శ్రీను నా క్లాస్‌మేట్ అయ్యారట. ‘రాఘవేంద్ర’ నుండి ప్రభాస్‌తోనే ప్రభాస్ శ్రీను ఉన్నారట. ‘‘ప్రభాస్ లేకపోతే ‘శ్రీను’ పేరుకు విలువ లేదు. ఆయనతో పరిచయం అయ్యాకే నా విలువ పెరిగింది” అని ప్రభాస్ శ్రీను చెబుతుంటారు.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!