వైరల్ అవుతున్న హృతిక్ రోషన్ కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది ఈ చిత్రం. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ‘వి.ఎఫ్.ఎక్స్’ వర్క్ జరుగుతుంది. ఇటీవల విడుదల చేసిన ‘సైరా’ టీజర్‌కు బాలీవుడ్ ప్రముఖుల నుండి కూడా అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన `వార్` చిత్రం కూడా అదే రోజు విడుదల కాబోతుంది. రెండూ కూడా భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి పోటీ తప్పదనే చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా హృతిక్ రోషన్ గతంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హృతిక్ మాట్లాడుతూ… ‘నా జీవితంలో చిరంజీవి సర్‌ని చాలా సార్లు కలిశాను. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్‌గా ఉంటారు. స్నేహభావం, మానవీయత ఆయనలో చాలా ఎక్కువ. గతంలో ‘ఐఫా’ అవార్డుల వేడుక సందర్భంగా నేను ఒక పార్టీ ఇచ్చాను. ఆ పార్టీకి చిరంజీవి అతిథిగా వచ్చారు. ఆయన అతిథిగానే వచ్చినప్పటికీ ఇతర అతిథులకు ఆయనే స్వయంగా వడ్డించారు. గౌరవం ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన ఇతరుల పై చూపించే ప్రేమ అద్భుతం’ అంటూ హృతిక్ గతంలో కామెంట్స్ చేసాడు. త్వరలో వీరిద్దరి సినిమాలూ పోటీ పడనున్న తరుణంలో ఈ వీడియో బయటకి రావడం… అది కాస్తా వైరల్ అవుతుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus