War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

‘వార్ 2’ (War 2) సినిమాకు సంబంధించి నిన్న మొన్నటివరకు చాలా అంచనాలు ఉండేవి. సినిమాలో అలా ఉండబోతోంది, ఇలా ఉండబోతోంది, ఎన్టీఆర్‌ (Jr NTR) పాత్ర అలా ఉండబోతోంది, ఇలా ఉండబోతోంది అంటూ లెక్కలేశారు. చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అయితే మొన్నొచ్చిన బర్త్‌ డే స్పెషల్‌ చూశాక కంపేరిజన్లు మొదలుపెట్టారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌లోని డొల్లతనం గురించి మాట్లాడుతున్నారు. మరికొందరు అయితే ఒకడుగు ముందుకేసి హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) , ఎన్టీఆర్‌ మధ్య కంపేరిజన్‌ పెట్టి మాట్లాడారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. మరోసారి కంపేరిజన్‌కు టీమే చాన్స్‌ ఇస్తోంది.

War 2

అవును, మీరు చదివంది నిజమే. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందని.. అందులో హృతిక్‌ రోషన్‌, తారక్ కలసి డ్యాన్స్‌ వేస్తారు అని చాలా నెలలుగా వార్తలొస్తున్నాయి. త్వరలో షూటింగ్‌ అనుకుంటుండగా హృతిక్‌ గాయపడటంతో షూట్‌ సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు ఆయన కోలుకోవడంతో షూటింగ్‌ వచ్చే నెలలో పెట్టుకుంటారు అని సమాచారం. అంతేకాదు ఆ పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)  సినిమాలోని ‘నాటు నాటు..’ పాట తరహాలో ఇద్దరూ పోటాపోటీగా డ్యాన్స్‌ వేసేలా ఉంటుంది అని చెబుతున్నారు.

రెండు నెలలుగా సినిమా టీమ్‌ ఈ పాట కోసం ఏర్పాట్లు చేస్తోంది. వందలాది మంది జూనియర్‌ డ్యాన్సర్లతో కలసి హృతిక్‌, తారక్‌ ఈ పాటకు స్టెప్పులేస్తారట. దీని కోసం ముంబయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోలో భారీ సెట్‌ సిద్ధం చేశారు కూడా. త్వరలో రిహార్సల్స్‌ కూడా ప్రారంభిస్తారు అని సమాచారం. ఇక ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయాలని టీమ్‌ చూస్తోంది.

అయితే ఇక్కడ విషయం వేరు. లుక్‌ విషయంలో, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ విషయంలో ఇటీవల హృతిక్, తారక్‌ మధ్య కంపేరిజన్‌ చేశారు నెటిజన్లు. దీంతో పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు డ్యాన్స్‌ విషయంలో ఇలాంటి పరస్థితే వస్తే ఏంటి అనేదే ఇక్కడ ప్రశ్న. ఇద్దరూ మంచి డ్యాన్సర్లే. కానీ కంపేరిజన్లు మొత్తం వైబ్‌ను దెబ్బ తీస్తాయి.

‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus