గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఛేంజ్‌తో మొదలైన ఆ విషయం ఫెమినిజం వరకు సాగింది. మధ్యలో త్రిప్తి డిమ్రి (Tripti Dimri) అగ్రిమెంట్, స్పిరిట్ (Spirit) , ఏమైనా చేసుకోండి.. ఇలా చాలా అంశాలు యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఈ చైన్‌కి ‘మనసు’ అనే మాటను జోడించాలి. ఈ జోరు చూస్తుంటే ఇది ఇప్పట్లో ఆగేలా లేదు కూడా. ఈ రోజు ఈ టాపిక్ మళ్లీ ఎందుకొచ్చింది అంటే ఈ విషయంలో దీపిక పడుకొణె (Deepika Padukone) రియాక్ట్ అయింది కాబట్టి.
అయితే ఆమె కూడా గుంభనంగా పేరెత్తకుండా కామెంట్ చేసింది. ఎప్పుడూ మనసు చెప్పేదే వింటాను అని దీపికా పడుకొణె రీసెంట్‌గా కామెంట్ చేసింది. అందులో ఏముంది, చాలామంది రెగ్యులర్‌గా చేసే కామెంటే కదా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పరస్థితి వేరు. ఇక అసలు విషయానికొస్తే.. దీపిక పడుకొణె ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని హొయలొలికించింది. ఆ తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం.
నేనెప్పుడూ దానికే ప్రాధాన్యమిస్తాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పేదే వింటాను అని చెప్పింది. అలా మనసు చెప్పింది వినే జీవితంలో కానీ, కెరీర్‌లో కానీ నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పిన దీపిక.. ఆ తర్వాత ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను అని క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఆమె మాటల్లో ఎక్కడా ‘స్పిరిట్’ సినిమా పేరు కానీ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు కానీ ప్రస్తావించలేదు.
అయితే పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఆ సినిమా గురించి, ఆ సినిమా చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించే మాట్లాడింది అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయం ఇక్కడితో ఆగేలా లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా ఇలాంటి విషయాల్లో అస్సలు తగ్గరు. తగ్గేవాడే అయితే రీసెంట్‌గా సోషల్ మీడియాలో ‘ఫెమినిజం అంటే ఇదేనా?’ అనే పోస్టు పెట్టేవారే కాదు. కాబట్టి ఆయన నుండి మరో బులెట్‌ను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.