Hrithik Roshan: హృతిక్ రోషన్ పవర్ఫుల్ లైనప్!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎలాంటి సినిమా చేసినా కూడా విబిన్నంగా ఉండాలని చూసుకుంటాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ రెగ్యులర్ గా కాకుండా తనదైన శైలిలో ఉండేలా హాలీవుడ్ టచ్ ఇస్తుంటారు. ఇక రాబోయే రోజుల్లో అతని నుంచి మరిన్ని హై వోల్టేజ్ సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా నాలుగు పెద్ద సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. హృతిక్ నుంచి రాబోయే నాలుగు చిత్రాలలో రెండు సీక్వెల్స్ అయితే ఒకటి రీమేక్,

మరొకటి ఒరిజినల్ సబ్జెక్ట్. హృతిక్ రోషన్ WAR సీక్వెల్ తో పాటు క్రిష్ సిరీస్ లో భాగంగా నాలుగవ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఫైటర్ చిత్రంలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హెయిర్ దీపికా పదుకొనే నటిస్తున్న ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హృతిక్ రోషన్ తమిళ సూపర్ హిట్ చిత్రం విక్రమ్ వేధ రీమేక్ లో కూడా నటించనున్నాడు.

కేవలం వెండితెరపైనే కాకుండా కాకుండా నేటి ట్రెండ్ కు తగ్గట్లుగానే ఓటీటీ కంటెంట్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడు. అందులో భాగంగా టామ్ యొక్క ది నైట్ మేనేజర్ హిందీ రీమేక్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus