Salman Khan: ఆర్ఆర్ఆర్ ను ఢీకొట్టే ఆలోచనలో సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమాలు తెరపైకి తీసుకువచ్చిన కూడా బాక్సాఫీస్ వద్ద చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ ను ఫినిష్ చేస్తూ ఉంటాయి. మినిమమ్ 300 కోట్లు అనేలా సల్మాన్ ఖాన్ చేసే ప్రతి సినిమా అతనికి మంచి లాభాలను అందిస్తూ ఉంటాయి. అందుకే సల్మాన్ ఖాన్ చాలాకాలంగా పారితోషికం కాకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నాడు. అంతేకాకుండా తన ప్రతి సినిమాకు కూడా సొంత ప్రొడక్షన్ ను జత చేస్తున్నాడు.

అయితే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ పై కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా వారి డామినేషన్ చూపిస్తున్నారు. దీంతో సల్మాన్ ఖాన్ కూడా ఆర్ఆర్ఆర్ ను మించే స్థాయిలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టైగర్ 3 సినిమాల్లో ఇద్దరు హీరోలను రంగంలోకి దింపుతున్నాడు.

సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం హృతిక్ రోషన్ ను సంప్రదించినట్లు గా తెలుస్తోంది. ఆ ఇద్దరు హీరోలతో మంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు అడిగిన వెంటనే ఒప్పేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ను కొట్టాలి అంటే టైగర్ 3 సినిమా కూడా ఒక ఉదాహరణ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం హిందీలోనే కాకుండా హిందీ తమిళ్ మలయాళం లో కూడా ఆ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ గత కొన్ని సినిమాలను తెలుగులో కూడా భారీగానే విడుదల చేశారు. కానీ అవి అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అందుకే కొన్ని తెలుగు సినిమాల్లో సల్మాన్ ప్రత్యేకమైన పాత్రను చేయడానికి కూడా ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా రాబోతున్న ఆ గాడ్ ఫాదర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus