షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మొహెంజదారో’..!

బాలీవుడ్ మన్మధుడు హృతిక్ రోషన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మొహెంజదారో’. ప్రాచీన మొహెంజదారో నాగరికత ఆధారంగా అడ్వెంచరస్, రొమాంటిక్ చిత్రంగా అశుతోష్ గోవరికర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం శుక్రవారంతో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు హృతిక్, అశుతోష్ తమ సామాజిక వెబ్ సైట్ల ద్వారా తెలిపారు. డిస్నీ ఇండియా, అశుతోష్ గోవరికర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ‌ఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus