Salaar: ‘సలార్‌’ రైట్స్‌.. అంతేసి అడిగితే ఎలా హోంబలే… అయ్యే పనేనా?

సినిమా టికెట్‌ ధర.. ఎంత ఉండాలి? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. అయితే ఇంతుండాలి అనే లెక్కేం లేదు కానీ.. సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్‌కి వెళ్లి చూడగలిగేలా ఉంటే చాలు అని మాత్రం చెప్పొచ్చు. అయితే మన నిర్మాతలు కొంతమంది బడ్జెట్‌ పెంచేసి, ఎక్కువకు అమ్మేసి.. థియేటర్లలో టికెట్‌ ధరలను కొండెక్కిస్తున్నారు. దీంతో సినిమాలకు లాంగ్‌ రన్‌ ఉండటం లేదు. ఇప్పుడు ఈ లాంగ్‌ రన్‌ అనేది ఎంత పెద్ద సమస్య సినీ గోయర్స్‌కి బాగా తెలుసు.

అయితే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అని అంటే.. (Salaar) ‘సలార్‌’ సినిమా లెక్కలు బయటకు వచ్చినందుకు అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. ‘సలార్‌’ సినిమా టీజర్‌ వచ్చిన తర్వాత ఇప్పుడు బిజినెస్‌ లెక్కలు మాట్లాడుతున్నారు జనాలు. సినిమా థియేట్రికల్‌ హక్కులు భారీ ధర పలుకుతున్నాయి అనేది వారి మాట. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం అయితే ‘సలార్’ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ థియేట్రికల్ హక్కులతోనే రూ.600 కోట్లు – రూ.700 కోట్లకు పైగా ఆదాయాన్ని టార్గెట్ చేస్తోందట.

అంతర్థమైందిగా సమస్య… అంతేకాదు ఇంకా ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలకు మాత్రమే హక్కులను రూ.200 కోట్లు – రూ. 250 కోట్లకుపైగానే చెబుతున్నారట. ఒక్క నైజాం ఏరియాకు రూ.80 కోట్లు – రూ. 100 కోట్లు, ఆంధ్రా, రాయలసీమ కలిపి రూ.120 కోట్లు – రూ. 140 కోట్లు అంటున్నారట. దీంతో ఇంతేసి మొత్తానికి సినిమా అమ్మితే.. టికెట్‌ ధర ఎంత పెడతారు అనే ప్రశ్న మొదలైంది. అంతేకాదు బడ్జెట్‌ పెంచేసి ఇలా భారీగా టికెట్లు ద్వారా ముక్కు పిండితే ఎలా అని కూడా అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ ధరల విషయంలో ఏపీ కాస్త బెటర్‌. మరీ అడ్డగోలుగా టికెట్‌రేట్లు పెంచే పరిస్థితి లేదక్కడ. అయితే తెలంగాణలో లెక్కకు మిక్కలి పెంచేయొచ్చు. దీంతో సినిమా వచ్చేసరికి సగటు సినిమా ప్రేక్షకుడి పరిస్థితి ఏంటి అనేది చూడాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus