బిగ్ బాస్ రియాలిటీ షోకి సీజన్ 4 కి ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా షోని రన్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఫైనల్ గా వేసుకున్న లెక్కలు , అలాగే ఫైనల్స్ కి చేసిన ఖర్చులు తెలిస్తే ఒక్కొక్కరూ నోరెళ్లబెడుతున్నారట. మరి అంత స్పాన్సర్ దగ్గర వర్కౌట్ అయ్యిందా లేదా అనేది కూడా చూడకుండా ఈసారి నిర్వహకులు భారీగా ఖర్చుపెట్టేసినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4 ఓపెనింగ్ రోజు సెట్ కి దాదాపుగా 2కోట్లు ఖర్చుపెడితే, ఫినాలేకి వేసిన సెట్ కి ఏకంగా 4.5కోట్లు ఖర్చుపెట్టినట్లుగా సమాచారం తెలుస్తోంది.
నిజానికి గ్రాండ్ ఫినాలేని మూడురోజులపాటు ప్లాన్ చేశారు. శుక్రవారం, శనివారం, ఆదివారం ఇది టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ వేశారని, కానీ కోవిడ్ కారణంగా అన్నిరోజులు చేయలేక ఒకేరోజులో ముగించేశారని టాక్. అంతేకాదు, ఈ మూడురోజులకి సెలబ్రిటీలని ఒక్కరోజే పిలిచి ఎలిమినేషన్ ప్రోసెస్ ని చేశారని చెప్తున్నారు. ఇక హౌస్ లో టాస్క్ లకి , ప్రోపర్టీస్ కి అయిన ఖర్చు, అలాగే హౌస్ డిజైన్ కి అయిన ఖర్చు కూడా చాలా భారీగానే ఉందని చెప్తున్నారు.
ఈసారి సీజన్ లో దెయ్యం టాస్క్ సెట్ వర్క్ కి చాలా ఖర్చుపెట్టారని టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, హౌస్ లో పార్టిసిపెంట్స్ కి కూడా అనుకున్నదానికంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ ని ముట్టజెప్పినట్లుగా చెప్తున్నారు. పార్టిసిపెంట్స్ లో మోనాల్ గజ్జర్ కి అందరికంటే ఎక్కువ పేమెంట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక గ్రాండ్ ఫినాలే ఖర్చుకూడా 3కోట్లకి పైగానే అయ్యిందని లెక్కలు చెప్తున్నారు. ఓవర్ ఆల్ గా సీజన్ 3 కంటే కూడా సీజన్ 4కే ఎక్కువ ఖర్చు అయ్యింది. అదీ విషయం.