Khiladi : ‘ఖిలాడి’ ఇటలీ షెడ్యూల్ కోసం భారీ ఖర్చు!

ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా చిత్రబృందం ఇటలీలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసింది. అయితే దాన్ని మధ్యలో వదిలేసి టీమ్ మొత్తం ఇండియాకి వచ్చేయాల్సిన పరిస్థితి కలిగింది. దానికి కారణం కరోనా భయమే. ఇటలీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతోంది.

ఏ సమయంలోనైనా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉండడంతో.. ‘ఖిలాడి’ చిత్రబృందం షెడ్యూల్ పూర్తికాకుండానే ఇండియాకు తిరిగి వచ్చేశారు. సగం రోజులే సినిమా షూటింగ్ చేసినప్పటికీ ఖర్చు మాత్రం ఓ రేంజ్ లో అయిందని సమాచారం. రూ.3 కోట్ల బడ్జెట్ తో ఈ షెడ్యూల్ ని పూర్తి చేయాలనుకున్నారు. కానీ సగం రోజులకే రూ.5 కోట్ల ఖర్చయింది. హోటల్ రూమ్స్, లొకేషన్ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడమే దానికి కారణం. పైగా ఇండియాకి తిరిగి వచ్చేయాలనే ఉద్దేశంతో.. టీమ్ మొత్తం స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాణించింది.

దీంతో ఖర్చు మరింతగా పెరిగిందని తెలుస్తోంది. ఇప్పుడు మిగిలిన పార్ట్ ని పూర్తి చేయడానికి మరోసారి ఇటలీ వెళ్లాల్సి ఉంది లేదంటే మ్యాచింగ్ సీన్లను ఇండియాలోనే పూర్తి చేయాలి. ఈ షెడ్యూల్ లోనైనా ఖర్చు అదుపులో ఉండేలా చూసుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా కనిపించనున్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus