NTR30: ఎన్టీఆర్, కొరటాల జీవితంలోనే హయ్యెస్ట్ బడ్జెట్!

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న పాన్ ఇండియా సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. జనతా గ్యారేజ్ సినిమా తరువాతి వస్తున్న సినిమా కావడం అలాగే RRR అనంతరం తారక్ చేస్తున్న సోలో పాన్ ఇండియా సినిమా కాబట్టి బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేలా లేరని అనిపిస్తోంది. ఒక మంచి గ్లోబల్ మెస్సేజ్ తోనే కొరటాల సేఫ్ జోన్ లో స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం.

ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని – ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఇటీవల సినిమా బడ్జెట్ పై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇంతవరకు ఎన్టీఆర్ – కొరటాల శివ కెరీర్ లోనే ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 200కోట్లు ఖర్చు చేయనున్నట్లు టాక్ వస్తోంది. ఎన్టీఆర్ RRR మూవీ 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నప్పటికి దాని స్పాన్ వేరు.

రామ్ చరణ్, రాజమౌళి క్రేజ్ కూడా ఆ సినిమా మార్కెట్ లో భాగం అవుతోంది. ఇక కొరటాల శివ అయితే ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. ఇక తారక్ మాత్రమే RRRతో హిట్టు కొట్టి తన 30వ సినిమాపై బజ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో చూడాలి. ఆచార్య అనంతరం కొరటాల ఎన్టీఆర్ 30వ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus