Prabhas: మెగా అల్లు ఘట్టమనేని వారసుల్లో ప్రభాస్ బొమ్మ!

టాలీవుడ్ లో రాబోయే తరం స్టార్ కిడ్స్ లో అతి పెద్ద అభిమాన జనాన్ని పొందుతున్న వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకిరా నందన్, మరొకరు అల్లు అర్జున్(Allu Arjun)  తనయుడు అయాన్, అలాగే మహేష్ బాబు (Mahesh Babu) కుమార్తె సితార. వీరు ముగ్గురూ తమ తమ తల్లిదండ్రుల నటనలో వారసత్వాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, వీరు ముగ్గురిలో ప్రత్యేకత ఏంటంటే వీరు ముగ్గురికీ ప్రభాస్ అంటే ప్రత్యేకమైన అభిమానం.

Prabhas

అయాన్ బన్నీ తనయుడిగా ఉన్నప్పటికీ, అన్ స్టాపబుల్ షోలో తన అభిమాన హీరో ప్రభాస్ (Prabhas)అని చెప్పినట్లు సమాచారం. బన్నీ ఫ్యాన్స్ అయాన్ కూడా తండ్రి వారసత్వాన్ని తీసుకుంటాడని ఆశిస్తున్నారు. ఇక అకిరా నందన్ విషయానికి వస్తే, డార్లింగ్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని వినిపిస్తోంది. ప్రభాస్ సినిమాలు మిస్ అవ్వకుండా చూసే అకిరా, కల్కి మూవీ స్పెషల్ షో కూడా చూశాడు.

మహేష్ బాబు కుమార్తె సితార కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఈ స్టార్ కిడ్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది స్టార్ కిడ్స్ ప్రభాస్ అభిమానులు అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఫ్రెండ్లీ నేచర్ మరియు స్టైల్ పిల్లలకు చాలా ఇష్టమైన అంశాలు. అందుకే పిల్లలు ఎక్కువగా ప్రభాస్ ని అభిమానిస్తారని అనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’   (The Rajasaab) మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. దీని తర్వాత హను రాఘవపూడి Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా చేయబోతున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) సినిమా కూడా చేయబోతున్నారు. ఇంకా ‘కల్కి 2898ఏడీ’ (Kalki 2898 AD) వంటి భారీ ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ప్రశాంత్ వర్మ మరియు లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకులతో కూడా కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus