‘జై బాలయ్య’ సాంగ్ ఎన్ని టీవీల్లో ప్రదర్శించారో తెలుసా!.. వీడియో వైరల్..!

‘‘జై బాలయ్య.. జై జై బాలయ్య’’.. శుక్రవారం ఉదయం నుండి.. టీ కొట్టునుండి టిప్పర్ లారీ వరకు.. పల్లె నుండి పట్నం వరకు ఎక్కడ విన్నా ఇదే పాటే.. నటసింహ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్‌లో అడిక్ట్ అయిపోయారు. మాస్, క్లాస్, చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ సాంగ్‌ని హమ్ చేస్తున్నారు. నందమూరి వీరాభిమానులు లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్నారు.‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు.. నిన్ను తలచుకున్నవారు లేచి నించుని మొక్కుతారు..

తిప్పు సామీ కోర మీసం.. తిప్పు సామీ ఊరి కోసం.. నమ్ముకున్న వారి కోసం.. అగ్గిమంటే నీ ఆవేశం.. నిన్ను తాకే దమ్మున్నోడు లేడే లేడయ్యా.. ఆ మెలతాడు కట్టిన మొగోడింకా పుట్టనేలేదయ్యా.. జై బాలయ్య.. జై జై బాలయ్య’’ అంటూ ‘వీర సింహా రెడ్డి’ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ సాగే మాస్ ఆంథెమ్ సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాలయ్య ఫ్యాన్స్.. ‘‘అభిమానులు అందరికీ ఉంటారు.. మా బాలయ్య బాబుకి మాత్రం భక్తులు ఉంటారు’’ అంటుంటారు.

అలాగే తమ ఫేవరెట్ యాక్టర్‌కి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని అయినా అందరికంటే విభిన్నంగా చేస్తుంటారు. బాలయ్య అభిమానులకు NBK హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత అనంతపురం జగన్ సుపరిచితమే. ఆయణ్ణి సోదర సమానుడిగా భావిస్తారు. ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ లాంఛింగ్ ప్రోగ్రామ్‌ని జగన్ వినూత్నంగా నిర్వహించారు. అనంతపురం జగన్ ఆధ్వర్యంలో.. జెమినీ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ నందు నూతనంగా లాంఛ్ చేసిన 105 ఇంచెస్ TVలో మొదటగా వీక్షించి,

తర్వాత ఏకంగా ఒకేసారి 107 TV లలో అభిమానుల సమక్షంలో ‘జై బాలయ్య’ సాంగ్ ప్రదర్శించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.. ఈ కార్యక్రమానికి మదమంచి శ్రీనివాసులు, LG showroom శరత్, రామ సుబ్బారెడ్డి, రాయల్ రమేష్ఆ త్మీయ అతిథిలుగా పాల్గొన్నారు. నవీన్ చౌదరి, బాయినేని రాము నాయుడు, ఆగివింటిశ్రీనివాస్, రాజశేఖర్, గిరి, ప్రవీణ్ మరియు బాలయ్య వీరాభిమానూలు సమక్షంలో భారీఎత్తున సెలెబ్రేషన్ జరిగింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus